సక్సెస్ అనేది అంత తేలిగ్గా రాదు. దాని కోసం ఎన్నో కష్టాలు మరెన్నో నష్టాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఆ విధంగా వస్తేనే సక్సెస్ కి ఓ కిక్ ఉంటుంది. ఇప్పుడు అటువంటి సక్సెస్ ను అందుకున్నారు ఏపీ సీఎం జగన్ . పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఎన్ని కష్టాలు పడ్డాడో.. ఎన్ని అవమానాలు భరించాడో అందరికీ తెలిసింది. అధికారంలోకి జగన్ వచ్చిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా.. ప్రజా సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తూ వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై ప్రజల్లో ప్రశంసలు వ్యక్తం అవుతుండగా  ఏపీలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ, తప్పుపడుతూ వచ్చారు. ఇప్పుడు వాటి గొప్పతనం ఏంటో దేశంలోని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకున్నాయి. 


ఏపీలో జగన్ అమలు చేసిన పథకాలు, కొన్ని నిర్ణయాలను అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఆ విధంగానే ఏపీ లో కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టం పై మహారాష్ట్ర ముందుకు వచ్చింది. ఈ చట్టం ఏర్పాటు చేయడంపై జగన్ పై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ ను అభినందిస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు జగన్ దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళలలపై ఎవరైనా అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడితే, విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ పథకాన్ని అతి తొందర్లో అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  

 

IHG


ఈ మేరకు ఈ చట్టానికి సంబందించిన ముసాయిదా  రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అశ్వతి నేతృత్వంలో పదిరోజుల్లో ముసాయిదా చట్టాన్ని రూపొందించే విధంగా ఓ కమిటీని  రూపొందించారు. ఈ మేరకు ఆ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. దిశ చట్టాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. పjది రోజుల్లోగా అధికారులు ముసాయిదా చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని మహారాష్ట్ర మంత్రి సతేజ్ పాటిల్ తెలిపారు. ఆ తరువాత న్యాయశాఖ దీనిని పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్ర చట్టాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: