ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసపెట్టి వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పై దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిధిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజిని మరియు తాజాగా నందిగాం సురేష్ పై వరుసపెట్టి దాడులు జరిగాయి. రాజధాని రైతుల ముసుగులో బయట వాళ్ళ చేత తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి దాడులు చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది. దీంతో వైయస్ జగన్ జరుగుతున్న దాడుల ఉద్దేశించి పార్టీ పెద్దలతో చర్చించిన సమయంలో పార్టీ పెద్దలంతా ఇంకా ఆ విధంగానే చేయాలి లేకపోతే మన వాళ్ళ మెడకే కేసులు చుట్టుకునే అవకాశం ఉంది అని ముఖ్యంగా ఎంపీ నందిగామ సురేష్ విషయంలో కామెంట్ చేసినట్లు పార్టీలో టాక్.

 

విషయంలోకి వెళితే ఇటీవల రాజధాని ప్రాంతం పరిధిలో కారం చేతిలో పెట్టుకుని నందిగామ సురేష్ పై జల్లే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ వీడియో లీక్ అయింది. దీంతో ఆ వీడియో ని ఆధారం చేసుకుని జగన్ ప్రభుత్వం కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల ముసుగులో టిడిపి ఆడుతున్న డ్రామాలు కట్టడి చేయడానికి జగన్ పకడ్బందీ వ్యూహం పన్నినట్లు వార్తలు వస్తున్నాయి.

 

విషయంలోకి వెళితే రాజధాని రైతుల లోనే సివిల్ లో పోలీసులను రంగంలోకి దించటానికి రెడీ అయినట్లు వాళ్ళ చేత రైతుల ముసుగులో వైసిపి నేతలపై చొరబడే వాళ్లని ప్రత్యేకంగా వీడియో తీసే విధంగా వాళ్లకి పూర్తి టెక్నాలజీతో రైతులలో సివిల్ పోలీసులను దించే ప్రయత్నం వైయస్ జగన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాబు అవినీతిపై కూడా సమగ్ర విచారణ చేయించడానికి జగన్ ఇప్పటికే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒకపక్క చంద్రబాబు అవినీతి మరియు మరోపక్క రాజధాని రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఆగడాలను బయట పెట్టడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: