సమకాలీన రాజకీయాల పై పోరాటం చేస్తా అంటూ ప్రకాష్ రాజ్  గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రకాష్ రాజ్. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటి... చేయాలనుకుంటున్నది  ఇంకొకటి అంటూ ప్రకాష్ రాజు తెలిపాడు. అయితే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రకాష్ రాజ్. 

 

 

 ఇక తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... పౌరసత్వ సవరణ చట్టం గురించి అడిగిన ప్రశ్నలకు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సమాధానాలు చెప్పారు ప్రకాష్ రాజు. బీజేపీ పార్టీ... పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ఒక కమ్యూనిటీ ని ఒక మతాన్ని  అవమానిస్తున్నారంటూ ప్రకాష్ రాజ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి  గన్ పట్టుకొని... గోలీమార్ సాలోకో  అనడం ఏమిటని ఇది ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది  అంటూ ప్రశ్నించారు. తమ స్వలాభం కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టిన  బిజెపి పార్టీ... పౌరసత్వ సవరణ చట్టం లోకి ధర్మం న్యాయం అనే పదాలను తెస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

 

పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చి బిజెపి పార్టీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ తాను మాత్రం సమకాలీన రాజకీయాలపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాను అంటూ తెలిపారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా భయపడను అంటూ తెలిపారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయనకు మద్దతు తెలుపుతున్నారా  అని ప్రశ్నించగా .  ఆయన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నందుకు  నేను ఆయనను సహకరించడం లేదని ఆయన చేస్తున్న పనులను బట్టి సమర్పిస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: