పౌరసత్వ సవరణ  చట్టానికి వ్యతిరేకంగా ఎన్నో రోజుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టం పై ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా వ్యతిరేక స్వరాలు వినిపించారు.పౌరసత్వ సవరణ  చట్టానికి ఎక్కువగా వ్యతిరేక స్వరం వినిపించిన వారిలో ముందుగా గుర్తొచ్చే పేరు సినీ నటుడు ప్రకాష్ రాజ్. పౌరసత్వ సవరణ చట్టం పై బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రకాష్ రాజ్  ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. బీజేపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రకాష్ రాజ్ పెద్ద దుమారమే రేపారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన  ప్రకాష్ రాజ్ . ఈ సందర్భంగా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 

 

 అయితే ఈ సందర్భంగా కేవలం పౌరసత్వ సవరణ చట్టం పైనే కాకుండా తెలంగాణ ఆంధ్ర రాజకీయాలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన మూడు రాజధానిల కు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులు  ప్రవేశపెట్టాలని అంటున్నారు దానికి సంబంధించి మీరు ఏమంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆసక్తికర  సమాధానం చెప్పాడు. జగన్ యువ ముఖ్యమంత్రి అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాడు అంటూ ప్రకాష్ రాజ్ అన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 3 రాజధానుల మాత్రం  ఎందుకో  నచ్చలేదు అంటూ  ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొత్తగా  ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానిల  ఏర్పాటు చేయడం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అంటూ ప్రకాశం రాజు వాక్యం ప్రకాష్ రాజ్ అన్నాడు. నా వరకైతే 3 రాజధానులు నాకు ఎందుకో  నచ్చలేదు అంటూ ప్రకాష్ తెలిపారు. అయితే తాను ఓసారి వైజాగ్ వెళ్ళినప్పుడు 3 రాజధానిల గురించి ఓ వ్యక్తి తనతో మాట్లాడిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయి అని.. విశాఖలో రాజధాని వస్తుంది అనే విషయంతో కొంచెం కూడా ఆసక్తి లేదు అంటూ ఓ వ్యక్తి తనతో అన్నాడని... ఆ వ్యక్తి సామాన్య వ్యక్త లేకపోతే టిడిపి పార్టీకి చెందిన వ్యక్తా లేదా వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిగా అనేది మాత్రం తనకు తెలియదు అంటూ ప్రకాష్ రాజ్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: