చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతుంది చైనా.. దీని విధానం ఎలా ఉందంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది.. ఇప్పటి వరకు అడ్డమైన గడ్ది అలవాటు చేసుకున్న చైనా కరోనా దెబ్బకు కుదేలులైపోయింది.. ఈ ఫలితం అది అనుభవించడమే కాకుండా ప్రపంచం అంతా పాకించింది.. చైనా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచదేశాలు కూడా కరోనా భారీన పడి అలమటిస్తున్నాయి..

 

 

ఇకపోతే చైనాకు చాలా అలస్యంగా జ్ఞానోదయం అయినట్లుగా ఉంది.. ఎందుకంటే కరోనా కత్తిలా మారి చైనాలో దొరికిన వారిని దొరికినట్లుగా చంపుకుంటు వెళ్లుతుంది. ఈ దెబ్బతో ఇప్పుడు చైనా మా కడుపులు కాలిగా ఉన్నా ఫర్వాలేదు బాబోయ్ కానీ ఈ మాయదారి రోగంతో అందరం అనాధలుగా మారి, తినడానికి తిండి లేకుండా అలమటిస్తున్నాం అని లబోదిబో మంటుంది.. ఇకపోతే ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి మొత్తం 2,705 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80000 మంది ఈ వైరస్ తో బాధపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చైనాలో కొత్తగా మరో 508 కేసులను ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ నిర్థారించిందట..

 

 

వీటిలో తొమ్మిది కేసులు మినహా మిగతావన్నీ హుబెయ్‌ ప్రావిన్స్‌ లోనే నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్ధం పడుతోంది. అంతే కాకుండా నిన్న ఒక్కరోజే చైనాలో 71 మంది మృత్యువాత పడ్డారు. హుబేయి ప్రావిన్స్‌లో లక్షలాది మంది ప్రజలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక కరోనా వల్ల చైనా మారుతుందని ఊహించని వారికి ఇదొక పెద్ద షాకే.. అదేమంటే ఇప్పటి దాకా అక్కడి ప్రజలు ఎటువంటి జంతువులను అయిన స్వేఛ్చగా తినేవారు.. కాని ఇకనుండి వన్యప్రాణుల మాంసం వినియోగం, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

 

 

తమ దేశ పౌరుల ప్రాణాల్ని బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే బిలియన్ల డాలర్ల పరిశ్రమలపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది... అది సరే ఇప్పటికైనా చైనా ఈ ఒక్క విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా మానవత్వంతో మసలుకుంటే మంచిదని అనుకుంటున్నారు కొందరు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: