ఏపీలో రాజ‌కీయం అధికార వైసీపీకి అనుకూలంగా వ‌న్‌సైడ్‌గా మారుతోంది. అటు టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క నేత‌ల వైసీపీలోకి క్యూ క‌డుతున్నారు. ఇక టీడీపీ నుంచే కాకుండా ఏ పార్టీలో లేని వాళ్లు... ముస‌లి కాంగ్రెస్‌లో ఉన్న సీనియ‌ర్లు సైతం ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు టాక్‌. ఈ లిస్టులోనే ఎవ్వ‌రూ ఊహించ‌ని ఓ బిగ్ షాట్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సీనియ‌ర్ నేత ఎవ‌రో కాదు రాజ్య‌స‌భ స‌భ్యుడు టి.సుబ్బ‌రామిరెడ్డి.



సినిమాల‌తో సంబంధం ఉన్న ఈ క‌ళాబంధు ఇచ్చే విందులు, ఆధిత్యాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఆయ‌న ఎప్ప‌ట‌కిప్పుడు ఏదో ఒక ఫంక్ష‌న్లు పెట్టి సినిమా వాళ్ల‌కు అవార్డులు ఇస్తూనే ఉంటారు. అందుకే ఆయ‌న‌కు క‌ళాబంధు అన్న పేరు స్థిర‌ప‌డిపోయింది. సుబ్బరామిరెడ్డికి పార్టీల‌కు అతీతంగా అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఇక మ‌రో రెండు నెల‌ల్లో టి.సుబ్బ‌రామిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వ‌కాలం ముగుస్తూ ఉంది.!



చాలా కాలంగా ఏదో ఒక ప‌ద‌వితో ఆయ‌న ఢిల్లీలో మ‌కాం వేస్తున్నారు. అది కూడా అధికారికంగా.. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మ‌రోసారి ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసే ఛాన్స్ లేదు. ఛ‌త్తీస్‌ఘ‌డ్ కోటాలో ఆయ‌న విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అవి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చెప్ప‌లేం. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఒకే ఆప్ష‌న్ జ‌గ‌న్‌. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.


ఇక ఇప్పుడు ఆయ‌న వైసీపీలోకి వెళితే ఎలా ఉంటుందా ? అన్న చ‌ర్చ‌లు త‌న‌కు అత్యంత స‌న్నిహితులు అయిన వారితో చేస్తున్నార‌ట‌. అయితే  ఇప్ప‌టికిప్పుడు వైసీపీలోకి చేరి, నామినేష‌న్ పొందే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. అక్క‌డా ఇప్పుడు పోటీ గ‌ట్టిగానే ఉంటుంది. ఇక జ‌గ‌న్ కూడా సుబ్బ‌రామ‌రెడ్డి పార్టీలో చేరితే ఆయ‌న‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే అది ఎప్పుడ‌న్న‌ది మాత్రం చెప్ప‌లేం.

మరింత సమాచారం తెలుసుకోండి: