సాధారణంగా అధికార పార్టీ అంటే ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఆధిపత్య పోరుకు ప్రస్తుతం ఏపీలో ఉన్న వైసీపీ అతీతంగా ఏమి లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ నేతల మధ్య ఆధిపత్యం కొనసాగుతుంది. పదవులు వచ్చిన వారు ఓ రకంగా పోతుంటే, పదవులు దక్కని వారు మరోరకంగా నడుస్తున్నారు. ఈ విధంగానే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ నేతలకు అసలు పడటంలేదు. ముఖ్యంగా సీనియర్ నేతలకు, జూనియర్ నేతల మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది.

 

జిల్లాలో సీనియర్లుగా ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిలు ఓ జట్టుగా ఉంటే, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఓ జట్టుగా ఉన్నారు. జూనియర్లుగా ఉన్నవారికి మంత్రి పదవులు దక్కి, తమకు దక్కకపోవడంతో ఆనం, కాకాణిలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

 

అందుకే వారు వీలు కుదిరిన చోటల్లా జూనియర్ నేతల లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలు అని చెబుతూ వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆనం అయితే ఓ సారి మంత్రి అనిల్ మీద బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భం ఉంది. అటు కాకాణికు, కోటంరెడ్డికి పడటం లేదు. వీరిద్దరు మధ్య పరోక్ష యుద్ధం చాలాసార్లు జరిగింది. ఇటీవల కూడా ఆనం, కాకాణిలు ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అనిల్ వేదిక మీద ఉండగానే అధికారుల లక్ష్యంగా విమర్శలు చేశారు. వాళ్ళు అలా విమర్శలు చేసిన మంత్రి సైలెంట్ గానే ఉన్నారు.

 

తాజాగా అయితే సీఎం కప్ పేరుతో బాల్ బ్యాడ్మింటన్ పోటీలు కాకాణికి చెందిన సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయి. దీనికి క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన, జిల్లాకు చెందిన మంత్రులు అనిల్, మేకపాటిలు మొహం చాటేశారు. అయితే సీనియర్ నేతలతో ఎందుకులే అనుకునే వీరు సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు సీనియర్లు ఏమో మంత్రులు ఎప్పుడు దొరుకుతారా..ఎప్పుడు విరుచుపడదామా అన్నట్లు ఉన్నారు. మొత్తానికైతే నెల్లూరులో సీనియర్లతో పోలిస్తే జూనియర్ నేతలు తెలివిగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: