అనంతపురంలోని  కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందంటూ తప్పుడు వార్త రాసిన ప్రముఖ మీడియా సంస్ధ  రాయటర్స్ తాజాగా డ్యామేజి కంట్రోలకు దిగింది. ఇందులో భాగంగానే          జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదించిన బ్రహ్మాండమంటూ ఆకాశానికి ఎత్తేసింది.  జగన్ ప్రతిపాదన వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఉన్న అవకాశాలు ఏమిటి అనే విషయంలో  ప్రత్యేక కథనాన్ని అందించింది. రాయటర్స్ ఇచ్చిన తాజా స్టోరీతో చంద్రబాబునాయుడుకు షాక్ తగిలినట్లే ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయటర్స్ లో వచ్చిన తప్పుడు కథనం దేశంలో ఎంతగా సంచలనం కలిగించిందో అందరూ చూసిందే. మీడియా సంస్ధలో వచ్చిన కథనం తమను ఆశ్చర్యానికి గురిచేసినట్లు ఇటు ప్రభుత్వం అటు కియా మోటార్స్ యాజమాన్యం స్పష్టంగా చెప్పాయి. ఆలోచనల్లో కూడా లేని తరలింపు ప్రాతిపాదనను రాయటర్స్ లాంటి ప్రముఖ మీడియా ప్రకటించటంపై యాజమాన్యం మండిపడింది. అయితే మీడియా సంస్ధలో వచ్చిన కథనం విషయంలో అందరు చంద్రబాబుపైనే అనుమానం వ్యక్తం చేశారు.

 

ఎలాగంటే ప్రత్యర్ధులను గబ్బు పట్టించటంలో మీడియా యాజమాన్యాలను మ్యానేజ్ చేసుకుని తప్పుడు కథనాలు రాయించటం చంద్రబాబు అండ్ కో కు బాగా అలవాటే. అందుకనే ఇపుడు కూడా అందరి దృష్టి చంద్రబాబు మీదే పడింది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తప్పుడు కథనం ఇవ్వటంతో రాయటర్స్ ఇమేజి దెబ్బ తిన్నదైతే వాస్తవం. అందుకనే ఇపుడు డ్యామేజి కంట్రోలుకు దిగినట్లు తెలుస్తోంది.

 

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన అమోఘమంటూ పెద్ద కథనాన్ని అచ్చేసింది. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నట్లు చెప్పింది. దేశంలోని అనేక రాజధానులు ఓవర్ క్రౌడ్ తో ఎలా ఇబ్బందులు పడుతున్నాయో వివరించింది. రాజధానులపై ఒత్తిడిని తగ్గించటానికి కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యలను ఉదాహరణగా చూపించింది. పనిలో పనిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించినపుడు భూములు ఇవ్వటానికి రైతులు ఎంతగా వ్యతిరేకించారో కూడా గుర్తుచేసింది. అంటే తప్పుడు కథనం ఇచ్చినందుకు తమకు ఎంత డ్యామేజ్ జరిగిందో రాయటర్స్ గుర్తించినట్లే ఉంది. అందుకనే డ్యామేజి కంట్రోలుకు దిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: