గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ పార్టీలో చూసినా అదే మాట వినిపిస్తోంది ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. త్వరలో గులాబీ దళపతి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని ఆ పదవిని తన రాజకీయ వారసుడు  కేటీఆర్ కూ  కట్టబెడుతున్నారు అంటూ చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అటు అధికార పార్టీ వర్గాలు కూడా పలుమార్లు సంకేతాలు కూడా ఇచ్చారు. దేశం మొత్తం యువ నాయకత్వాన్ని కోరుకుంటుంది అంటూ పలు ప్రసంగాలలో కూడా వ్యాఖ్యానించారు టిఆర్ఎస్. 

 

 

 ప్రస్తుతం వివిధ పార్టీల లో కూడా ఈ అంశమే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంకొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుని ఆ పదవిని రాజకీయ వారసుడు ప్రస్తుత ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పి... ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల వైపు వెళ్తారని... టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ సమర్ధుడు అని చాలామందికి స్వరాలు వినిపిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్ని నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 

 

 

 తాజాగా ఓ మీడియా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ హాజరైన ప్రకాష్ రాజ్.. త్వరలో తెలంగాణలో కేటిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం మీకు ఇష్టమైన మీ అభిప్రాయం ఏమిటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. కేసిఆర్ వారసుడిగా నే కాకుండా... కేటీఆర్ పనితీరును చూసుకుంటే ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. తెలంగాణలో కేసిఆర్ కు సాటి వచ్చే  యంగ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు. తెలంగాణలోనే కాదు దేశంలోనే ఎవరైనా ఉన్నారా అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత ఉంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: