ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అన్న సామెత తెలుగులో బాగా పాపులర్. ఈ సామెత చంద్రబాబునాయుడుకు బాగా వర్తిస్తుందనటంలో సందేహమే లేదు. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటాన్ని చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలతో పాటు రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తాము ప్రభుత్వానికి భూములిస్తే దాన్ని పేదలకు పట్టాల రూపంలో పంచుతారా ? అంటూ రైతుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి పై మండిపోతున్నారు. ఇక చంద్రబాబు వేస్తున్న రంకెల సంగతి చెప్పనే అక్కర్లేదు.

 

అయితే పేదలకు పట్టాల పంపిణి వ్యవహారంలో చంద్రబాబు నోరు మూయించటం కోసం జగన్  సిఆర్డీఏ చట్టాన్నే ప్రయోగించాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు చేసిన వేలాది ఎకరాల భూ సమీకరణలో 5 శాతం భూమిని పేదల గృహనిర్మాణం కోసం కేటాయించాలని సిఆర్డీఏ చట్టం 53(డి) నిబంధనలో స్పష్టంగా ఉందట. నిజానికి చంద్రబాబు కలలు కన్న భ్రమరావతి గనుక పూర్తయ్యుంటే సిఆర్డీఏ చట్టం లేదు ఏమీ లేదన్నట్లుగానే ఉండేది. ఎందుకంటే చంద్రబాబు ఏమనుకుంటే దాన్నే చట్టంగా అమలు చేసేశారు అప్పట్లో.

 

డబ్బున్న వాళ్ళకు ప్రధానంగా కమ్మోళ్ళకు గేటెడ్ కమ్యూనిటిగా మార్చేయాలని చంద్రబాబు కలలు కన్న తర్వాత మళ్ళీ అందులోకి పేదలు అడుగుపెట్టడం కూడానా ? చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లుగా అమలయ్యుంటే అమరావతి రాజధానిలోకి ఎగువ మధ్య తరగతి జనాలు కూడా అడుగు పెట్టే అవకాశం ఉండేది కాదనటంలో సందేహం లేదు.

 

ఇలాంటి ప్రాంతంలో జగన్ పేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయబోతున్నాడంటే చంద్రబాబు అండ్ కో చూస్తూ ఊరుకుంటారా ? చూస్తు ఊరుకోక ఏం చేస్తారు ?  చంద్రబాబు తయారు చేయించిన చట్టం ప్రకారమే కదా పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణి చేయిస్తున్నది ? తాను చేయించిన చట్టాన్నే చంద్రబాబు కదనగలడా ? ఈ ఒక్క లాజిక్ పట్టుకునే జగన్ ధైర్యంగా అమరావతి గ్రామాల్లో పేదల ఇళ్ళపట్టాలకు రెడీ అయిపోయారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు చూస్తు ఊరుకోరులేడు, అలాగని వ్యతిరేకించనూ లేడు. మొత్తానికి సిఆర్డీఏ చట్టాన్ని చంద్రబాబు మెడకు జగన్ ఉచ్చు బిగించేసినట్లు అర్ధమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: