రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ పరిరక్షణ సమితి నేతలు చేస్తోన్న ఆందోళనలకు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే అనవసర ప్రచారాన్ని కల్పిస్తున్నారా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . అమరావతి పరిరక్షణ సమితి అద్వర్యం లో చేస్తోన్న ఆందోళన గురించి రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం మానేసిన తరుణం లో ఎంపీ నందిగం సురేష్ , ఎమ్మెల్యే రోజాలు చేసిన అతి వల్లే మరొకసారి రాజధాని రైతాంగం చేస్తోన్న ఆందోళనల గురించి రాష్ట్ర ప్రజలు మరొకసారి చర్చించుకునే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

 

అమరావతి రథోత్సవం లో పాల్గొనేందుకు వెళ్లిన ఎంపీ నందిగం సురేష్ కాన్వాయి లోని కారు ఒక రైతును ఢీ కొట్టింది . సురేష్ కాన్వాయిలోకి కారు అతని  కాలిపైకి ఎక్కినట్లు వీడియో లో స్పష్టంగా కన్పించింది . అయితే అంతకుముందు సురేష్ ను అడ్డుకునేందుకు  ఉద్యమ పరిరక్షణ సమితి నేతలు ప్రయత్నం చేశారు . కొంతమంది ఆయన వాహనం పై దాడి చేసే ప్రయత్నాన్ని కూడా చేసిన దృశ్యాలు కూడా   వీడియో లో స్పష్టంగా కన్పించాయి  . అయితే సురేష్  కాన్వాయిలోని వాహనం రైతు కాలిపైకి ఎక్కడం వల్ల, తనపై దాడికి యత్నించిన ఆందోళనకారులను  వాహనం తో ఎక్కి తొక్కించే ప్రయత్నాన్ని ఎంపీ చేశారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి .

 

దానికితోడు కొన్ని పత్రికలు, చానళ్ళు ఇదే అంశం పై  పనిగట్టుకుని ప్రత్యేక కథనాలు రాయడం ,  చర్చా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల  ,  అమరావతి ఆందోళనల గురించి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయింది . అంతకుముందు రోజా కూడా  అమరావతి పరిరక్షణ సమితి నేతలు  తనని అడ్డుకునే ప్రయత్నాన్ని చేయడం పట్ల ఆగ్రహం తో ఊగిపోతూ , అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని విపక్షాలు అందిపుచ్చుకోవడం జరిగింది . ఇలా అమరావతి పరిరక్షణ సమితి చేస్తోన్న ఆందోళనలు  ప్రజల మష్కిస్తం నుంచి చెదిరిపోతున్న ప్రతి సందర్భంలోను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ...  తమ దుందుడుకు చర్యలతో వారికి  ఉచిత ప్రచారాన్ని కల్పిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి .      

మరింత సమాచారం తెలుసుకోండి: