రాజధాని కోసం సేకరించిన భూములను  పేదలకు ఇంటి నివేశన స్థలాల కోసం కేటాయించాలని  నిర్ణయించిన  జగన్ సర్కార్, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది . అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని  విపక్షాలు తప్పుపడుతున్నాయి . ప్రభుత్వ నిర్ణయం ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందంటూ జనసేనాని ఫైరయ్యారు . పేద ప్రజలకు ఇళ్ల నివేశన స్థలాలను ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టరని కానీ ఒకవైపు భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేస్తుంటే , వారిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలిస్తాననడం ఏమిటని ఆయన ప్రశ్నించారు .

 

ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి వివాదం లేని భూముల్ని ఎంపిక చేసి పేదలకు ఇళ్లస్థలాలను కేటాయించాలని  పవన్ కళ్యాణ్   డిమాండ్ చేశారు .  రాజధాని ప్రాంతం లో 54 , 307  మంది లబ్ధిదారులకు సెంటు చొప్పున  1 , 251  . 5065 ఎకరాల భూమిని జగన్ సర్కార్  కేటాయించింది . ఈ మేరకు మున్సిపల్ శాఖ జీవో నెంబర్ 107 విడుదల చేసింది .  జీవో 107 విడుదల వెనుక రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర దాగి ఉన్నదని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది . టీడీపీ హయాం లో నిర్మాణమై ఉన్న ఇళ్లను పేదలకు కేటాయించకుండా , రాజధాని ప్రాంతం లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.   విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

 

ప్రజా చైతన్య యాత్రలో జగన్ సర్కార్ కుట్రను ప్రజలకు వివరించి , అమరావతి ఉద్యమాన్ని ప్రరిరక్షించుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది . అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం తో విపక్షాలు ఆత్మరక్షణ లో పడినట్లు కన్పిస్తున్నాయి . పేదలకు ఇళ్ల నివేశన స్థలాల కేటాయింపును గట్టిగా వ్యతిరేకించను లేక , అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించను లేక ఇబ్బందులు పడుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: