గత కొన్ని రోజులుగా ఢిల్లీలో సిఏఏ అల్లర్లు జరుగుతున్నాయి.  ఈ అల్లర్లను సద్దుమణిగేలా చేయడం కోసం కేంద్రం ఎంతగానో ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.  సిఏఏ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ చట్టం కేవలం కొందరిని ఉద్దేశించి తీసుకొచ్చిన చట్టమే అని, ఎన్ఆర్సి విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నెత్తినోరు బాదుకుని చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  


ఏదో జరిగిపోతుందని కొంతమంది నిరసనలు చేయడం మొదలుపెట్టారు.  ఈ నిరసనల మధ్యలోకి ఆందోళనకారులు వచ్చి ఆజ్యం పోశారు.  రాళ్ళూ రువ్వడం మొదలుపెట్టారు.  జమ్మూ కాశ్మీర్లో ఆగిపోయిన రాళ్ళూ రువ్వడం అనే పద్దతి ఇప్పుడు ఢిల్లీలో మొదలైంది.  జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు అక్రమ మార్గంలో ఇండియాలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వెదజల్లి, స్థానికులను లోబరుచుకుని రాళ్ళూ రువ్వే ఉద్యోగం ఇచ్చేవారు.  


అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిడంతో పాటు, యువతకు ఉద్యోగాలు కల్పించడం మొదలు పెట్టడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  అక్కడ ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నది.  అయితే, ఢిల్లీలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఢిల్లీలో ముఖ్యంగా చాంద్ బాగ్, జఫ్రాబాద్ ఏరియాలలో ఆందోళన కారులు అల్లర్లు చేయడంతో పరిస్థితి చేయిజారిపోయింది. 


దీంతో అక్కడ కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.  జమ్మూ కాశ్మీర్లో అందరిని సమన్వయం చేసి శాంతి పవనాలు వీచే విధంగా చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  ఈశాన్య ఢిల్లీలో ఎక్కడైతే అల్లర్లు తీవ్రస్థాయిలో జరిగాయో అక్కడ పర్యటిస్తున్నారు.  ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరిగి అందరిని పలకరిస్తూ.. ధైర్యం చెప్తూ, దేశం విషయంలో యువత ఎలా ఉండాలో చెప్తూ అందరిని సమన్వయం చేస్తున్నారు.  అజిత్ దోవల్ చెప్తున్న విషయాలను ఢిల్లీ ప్రజలు చక్కగా వింటూ అల్లర్లు ఆపుతామని చెప్తుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: