వైసీపీ మూడు రాజధానుల ప్రకటించిన తర్వాత.. మొదటిసారి చంద్రబాబు రేపు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా.. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనపై విమర్శలపై విరుచుకుపడుతోంది వైసీపీ. మరోవైపు.. విశాఖలో వైసీపీ అక్రమాల గుట్టు విప్పుతానని టీడీపీ ప్రకటించడంతో.. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర టూర్ ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది.

 

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్ ఉత్కంఠ రేపుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. మొదట విశాఖ జిల్లా పెందుర్తిలో లాండ్ పూలింగ్ బాధితులతో సమావేశమవుతారు. కార్యనిర్వాహక రాజధాని కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌ చేస్తుండగా.. అక్కడి స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు వారితో భేటి కావడం చర్చనీయాంశమైంది. 

 

విజయనగరంలో జిల్లాలో రెండు మూడు చోట్ల రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన బోతున్నారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత తొలి సారి చంద్రబాబు ఉత్తరాంద్రకు వస్తుండడంతో టీడీపీ నేతలు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబు టూర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

 

ఉత్తరాంద్ర టూర్ లో వైజాగ్ కు వైసీపీ చేసిన నష్టాన్ని వివరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ నుంచి కంపెనీలను వెళ్లగొట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికొ తోడు నగరంలో జరిగిన భూ అక్రమాలపైనా వివరాలు వెల్లడిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాజధానిగా అమరావతే ఉండాలంటున్న చంద్రబాబు....ఉత్తారంధ్ర పర్యటనలో ఏం చెపుతారు అనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు తొలి పర్యటన కావడంతో స్థానిక ప్రజలను ఆయన ఏం వివరిస్తారు. వైసీపీ విమర్శలను ఎలా తిప్పికొడతారు అనేది చర్చగా మారింది. 

 

ఉత్తరాంద్ర టూర్ పై చంద్రబాబు కూడా కసరత్తు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు టూర్ ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో...టీడీపీ నేతలు టూర్ కు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా పెందుర్తి లాండ్ పూలింగ్ బాదితులతో సమావేశం ఏర్పాటు చేశారు. తద్వారా ప్రభుత్వ బాదితుల తో మీటింగ్  పెడుతున్నారు. అధికార పార్టీ నేతల వ్యూహాలపై సమాచారం తెప్పించుకున్న అధిష్టానం....అందుకు అనుగుణంగా ఆ ప్రాంత నేతల సిద్దంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: