ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో రాజధాని రగడ రగులుతున్న విషయం తెలుసిందే.  అమరావతి రైతులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ఇక అమరావతి రైతులను  శాంతింప చేసేందుకు అటు జగన్ ప్రభుత్వం కూడా వివిధ హామీలను కురిపిస్తూ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ రాజధాని అమరావతి గురించి అమరావతి ప్రాంత ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తర్వాత... అమరావతి ఇకపై బహుజన అమరావతి... సర్వజన అమరావతి గా మారిపోతుంది అంటూ అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి లో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఇతర కులాల్లో నిరుపేదలకు సంబంధించి 50 వేల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇళ్లస్థలాలు కేటాయిస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

 

 

 ఇక నుంచి అమరావతి కొందరి రాజధాని కాదు అందరి రాజధాని గా మారబోతుందని  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అమరావతి ప్రాంతంలో 50 వేలు  నిరుపేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చిన బాధ ఏమిటి అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి... పేదల ఇళ్ల కోసం స్థలాలు ఇస్తుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 రాజధాని ప్రాంతంలో కి నిరుపేదల ఎవరిని రానివ్వకూడదనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో ఎన్నో అక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడ్డారని... చంద్రబాబు చేసిన వాగ్దానాలు అన్నింటిని గంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు అంటూ విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా.. జగన్ సర్కార్ పై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంతంగా భూసేకరణ జరగడం లేదు అంటూ తెలిపిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు అనుకూల మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: