ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు అస్సలు విలువ  లేకుండా పోయింది. రోజురోజుకు పెరుగుతున్న హత్యలతో అసలు సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వివాదాలకే  ఏకంగా మనిషి ప్రాణాలను తీసేస్తున్నారు సాటి మనుషులను. కాస్తయినా దయ జాలి లేకుండా.. క్రూరంగా మానవత్వం మరిచి ప్రాణాలను హరించేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి చిన్న చిన్న వివాదానికే హత్య చేస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చట్టాలపై కూడా కొంచెం కూడా భయం లేకుండా.. ప్రాణాలు తీసేస్తున్నారు.  దీంతో సగటు మనిషి రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా...  తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తనకు రావాల్సిన ఐదు రూపాయల చిల్లరను  అడిగినందుకు.. ఆ వ్యక్తిని చితకబాది హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ₹5 చిల్లర అడిగినందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ముంబైలోని బోరివలి కి చెందిన రామ్ ధులత్ సింగ్  యాదవ్ అనే వ్యక్తి మంగళవారం గ్యాస్ నింపించుకోవడానికి దగ్గర్లోని గ్యాస్ స్టేషన్ కి వెళ్ళాడు. 

 

 

 ఈ క్రమంలోనే గ్యాస్ ను  నింపించుకున్న  రామ్ ధులత్  యాదవ్ అనే వృద్ధుడు... డబ్బులు చెల్లించిన తర్వాత... తనకు రావాల్సిన ₹5 చిల్లర గురించి అడిగాడు. దీంతో ఆ వృద్ధుడు ఏదో తప్పు చేసినట్లుగా అక్కడ పనిచేసే కొంతమంది ఆ వృద్ధుని చుట్టుముట్టి తిట్టడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత చేయి కూడా చేసుకున్నారు. రామ్ ధులత్  యాదవ్ ను దారుణంగా చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. ఇక బుధవారం రామ్ కుమారుడు సంతోష్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఈ హత్యకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: