ఎవరిని ఎప్పుడు ప్రేమలో పడేస్తుందో... ఎవరిని ఎప్పుడు విడగొడుతుందో ప్రేమకు ఎప్పడికి తెలియదు.. అయితే..  ప్రేమలు పెళ్లి వరకు వెళితే మరి కొన్నీ ప్రేమలు  తీరేవరకు ఉంది ఆతర్వాత ఎవరి పాటికి వారు వెళిపోతారు.. ప్రేమ ఎప్పుడు ముదురుతుందో.. మరెప్పుడు ముక్కలవుతుందో తెలియదు. ప్రేయసీ ప్రియుల మధ్య సమన్వయం.. పరస్పర విశ్వాసం లేకపోతే ఆ ప్రేమ ఎప్పటికీ నిలవదు. ప్రేమైనా, పెళ్లయినా నమ్మకమనే పునాదులపైనే నిలబడతాయి. లేకుంటే మనసు ముక్కలవుతుంది. 

 

 

 

కారణం ఏదైనా.. అప్పటి వరకు ప్రేమించి వెళ్లిపోయే వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడమనేది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఉండకూడదు కూడా. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు కోకొల్లాలు. ప్రేమలు, ప్రతీకారాలు, హత్యలు, అత్యాచారాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే యూపీలో సభ్యసమాజం ముక్కున వేలు వేసుకొనే మరో ఘటన చోటుచేసుకుంది.

 

 

 

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని సలోన్ గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అలా కొద్దీ రోజులు చెట్టా ఫట్టలేసుకొని తిరిగారు.వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత ఆమె.. ప్రియుడిని మరిచిపోయి సాధారణ జీవితం గడుపుతోంది. ఇంట్లో తల్లిదండ్రులు చూసిన ఓ లాయర్‌ను పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించింది. మరో వారంలో రోజుల్లోనే పెళ్లి. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్‌కు ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇదే తగిన సమయమని భావించిన అతడు.. ఊరంతా పోస్టర్లు అతికించాడు.

 

 

ఊరంతా హ్యాపీ హోలీ అంటూ పోస్టర్లను అతికించారు. అందులో ఆ అమ్మాయి పోస్టర్లు అందరికి కనిపించేలా అతికించారు. దీంతో యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానంతో సరోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ విచారించగా అసలు విషయం తెలిపాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టర్లు వేశానని పేర్కొన్నాడు. సలోన్ సర్కిల్ ఆఫీసర్ వినీత్ సింగ్ స్పందిస్తూ.. ‘‘యాంటి రోమియో టీమ్ సరోజ్ గురించి గాలించింది.అతన్ని అరెస్ట్ చేసి పోస్టర్లు తొలగించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: