చుట్టూ సముద్రం ఉన్నా గుక్కెడు తాగునీరు లేకపోతే మనిషి మనుగడ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అదే.. దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నా.. ఇంకా చాలా ప్రాంతాల్లో తాగు నీటికి కటకటే. అనేక రోగాలు అపరిశుభ్రమైన తాగునీరు వల్లే వస్తున్నాయని తెలిసినా ప్రజలకు తప్పని ప్రాణ సంకటం అది. ఇప్పుడు దాన్ని తొలగించేందుకు ఏపీ సీఎం జగన్ సాగర మథనం జరపబోతున్నారు. పురాణాల్లో అమృతం కోసం క్షీర సాగర మథనం జరిగితే.. ఇప్పుడు జనం కోసం జగన్ సాగర మథనం జరపబోతున్నారు.

 

మరి సాగర మథనం ఎలాగంటారా.. సముద్రంలో నీటిని తాగు నీటిగా మార్చే ప్రక్రియను డీశాలినైజేషన్ అంటారు. ఇలా చేయడంలో ఇజ్రాయల్ దేశం మంచి పేరుగాంచింది. ఆ దేశానికి చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి డీశాలినేషన్ ప్లాంట్లు నిర్వహిస్తోంది. గతంలో ఇజ్రాయిల్ వెళ్లినప్పుడు జగన్ ఈ ప్లాంట్లను సందర్శించారు. ఇప్పుడు ఏపీలో ఈ టెక్నాలజీ వాడబోతున్నారు. ఈ విషయంపై జగన్ ను ఆ కంపెనీ ప్రతినిధులు తాజాగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నం హర్షణీయమని వారు అన్నారు.

 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇజ్రాయెల్‌ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధుల బృందం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్ మీడియాతో మాట్లాడారు. ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, భారత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. 1964 లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంటును ఇజ్రాయెల్‌లో పెట్టామని పేర్కొన్నారు.

 

ఐడీఈ టెక్నాలజీస్‌ నాలుగు దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని ప్రతినిధుల బృందం తెలిపింది. భారత్‌తోపాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: