కొందరి మాటలకు అసలు అర్ధాలే ఉండవు.. కాని పనిని అయినట్లుగా, అయ్యే పనిని కానట్లుగా చెబుతుంటారు.. ఇది లోకంలో ఉన్న కొందరి తీరు.. మరికొందరు మూఢాచారాలను విపరీతంగా నమ్మేస్తుంటారు.. ఏది చెబితే అది నమ్మేయడమే ఇలాంటి వారి పని.. ఇకపోతే ఒక ప్రాణికి రూపం రావాలంటే రెండు జీవుల కలయిక అనేది ముఖ్యమైన పక్రియ. అలాగే ఇది సృష్టి నియమం.. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే గర్భం వస్తుంది.

 

 

ఇక ప్రకృతి ఏర్పరచిన నియమాన్ని కాదని, దానికి విరుద్దంగా టెక్నాలజీని  అభివృద్ధి చేసుకుని మనిషి సరోగసి, విధానం ద్వారా.. లేదా  మరొ టెక్నాలజీ ఉపయోగించి పిల్లల్ని కంటున్నారు. కానీ కేవలం ఆడ, మగ స్విమ్మింగ్ పూల్ లోకి దిగితే పిల్లలు పుట్టే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. రాదు కూడా.. ఇది అసాధ్యం.. ఇక ఈ పిల్లలు పుట్టడం అనే విషయంలో ఇండోనేషియాకు చెందిన చైల్డ్ హెల్త్ కమిషనర్ ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనంగా మారాయి.

 

 

అదేమంటే మహిళలు పురుషులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లోకి దిగి స్విమ్ చేయడం వలన మహిళలు గర్భం దాల్చే అవకాశం ఉందని, ఎందువల్ల అంటే మహిళలతో కలిసి పురుషులు స్విమ్మింగ్ చేసినపుడు పురుషులు టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వీర్యం నీళ్లలో స్ఖలిస్తే ఫలితంగా  దాని వలన మహిళలు గర్భం దాలుస్తారని చెప్పింది. ఇండోనేషియాలో ఈ వ్యాఖ్యలపై  దుమారం రేగింది.

 

 

ఈ విషయంలో అక్కడి నెటిజన్స్ స్పందిస్తూ, ముర్ఖంగా మాట్లాడకూడదని, పురుషులు సంస్కారం లేని వ్యక్తులు కాదని కొందరంటే, వైద్యులు మాత్రం క్లోరినేషన్ చేసిన నీటిలో శుక్రకణాలు జీవించలేవని, ఈదలేవని అంటున్నారు... నిజమే కదా.. పనికిమాలిన వార్తలను వ్యాపింపచేయడంలో కొందరు ఇలాగే ముందు ఉంటారు.. ఎందుకంటే సిమ్మింగ్ పూల్‌లో దిగితే పిల్లలు పుట్టడం ఏంటి బాబు.. ఇది మరీ చిత్రం కాకుంటే.. అందుకే ఇలాంటి వార్తలు అసలే నమ్మకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: