ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో పడిపోయింది.  ఆర్ధికంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  ఈ పరిస్థితుల్లో కరోనా ప్రభావం కారణంగా మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.  కరోనా వలన ఇప్పటికే చైనా వంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  కానీ, ఈ కరోనా వలన ఇంకా అనేక ఇబ్బందులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

 

చైనా నుంచి ఎగుమతులు, చైనాకు దిగుమతులు ఆగిపోయాయి.  ఫలితంగా చైనా అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  చైనాను ఆదుకోవడానికి ప్రపంచం మొత్తం ప్రయత్నం చేస్తోంది.  కానీ, ఇప్పుడు ఆ ప్రపంచానికే ముప్పు వచ్చేలా కనిపిస్తోంది.  ముఖ్యంగా చైనాలో వస్తున్నా మార్పులు ఇందుకు కారణాం కావొచ్చు.  చైనాలో వైరస్ ప్రభావం కొంతమేర తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది.  


అయినప్పటికీ కూడా దీని ప్రభావం పూర్తిగా తగ్గుతుందని మాత్రం చెప్పలేకపోతున్నారు.  ముఖ్యంగా చైనా నుంచి ఈ వైరస్ ఇప్పుడు బయటకు విస్తరిస్తోంది.  అందువలన ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది.  చైనా తరువాత ఎక్కువగా మధ్య ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటం భయపెడుతున్నది. ఇప్పటికే అక్కడ దాదాపుగా 1500 మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డారు.  రోజు రోజుకు కరోనా కొరియాలో విస్తరిస్తుండటం అక్కడి ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది.  


ఇదిలా ఉంటె యూరప్ దేశాల్లో కూడా ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపుతున్నది.  ఇటలీలో ఇప్పటికే 150 మందికి పైగా ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది.  ఈ వైరస్ ప్రభావం కారణంగా ఇటలీ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే విధంగా కనిపిస్తోంది.  యూరప్ దేశాల్లో ఇటలీ ఆర్ధికంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇది మరొక దెబ్బగా చూడాలి.  ఆసియా దేశమైన ఇరాన్ లో అత్యధికంగా వైరస్ మరణాలు కనిపించాయి.  ఇలా చూసుకుంటూ పొతే, రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ఆర్ధికంగా ఈ వైరస్ దెబ్బకు ఇబ్బందులు పడేలా కనిపిస్తున్నాయి.  మరి ఏమౌతుందో ఎలా దీనిని ఎదుర్కొంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: