ఆ దేశ ప్రభుత్వం దేశ పౌరులకు ఒక్కొక్కరికి 90 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 70 లక్షల మందికి 90 వేల రూపాయలు ఇవ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాలలోకి వెళితే హాంగ్ కాంగ్ దేశ ప్రభుత్వం దేశ పౌరులకు ఒక్కక్కరికి 90 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందువలనే ఈ నిర్ణయం తీసుకున్నామని హాంగ్ కాంగ్ ప్రభుత్వం చెబుతోంది. 
 
హాంగ్ కాంగ్ దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో హాంగ్ కాంగ్ కరెన్సీ విలువ పడిపోయింది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచితే ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కుతామని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం నుండి బయటపడాలనే ఉద్దేశంతో 120 బిలియన్ హాంగ్ కాంగ్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికి 10,000 హాంగ్ కాంగ్ డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో 90 వేల రూపాయలు) ఇవ్వనుంది. ప్రభుత్వం 18 ఏళ్లు పై బడిన వారికి అది కూడా పర్మినెంట్ పౌరులకే నగదు ఇవ్వనుంది. అధికారులు గతంలో తాము ఈ స్థాయిలో ఆర్థిక మాంద్యం పరిస్థితులను చూడలేదని చెబుతున్నారు. 
 
గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు మొదలయ్యాయి. ఆ దేశ ఆర్థిక మంత్రి అమెరికా - చైనా వాణిజ్య యుద్దం హాంగ్ కాంగ్ దేశ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైందని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా పోయిన తరువాత హాంగ్ కాంగ్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: