గత కొంతకాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే.  ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నది.  ముఖ్యంగా చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు భయాందోళనలు నెలకొన్నాయి.  చైనా నుంచి ఇండియాకు వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని భయపడ్డారు.  కానీ, ఇండియన్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వలన ఇండియాలో దీని ప్రభావం కనిపించలేదు.  


అయితే, కొన్ని రోజుల క్రితం చైనాలోని కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతమైన వుహాన్ నగరం నుంచి కొంతంది ఇండియన్ ను వెనక్కి తీసుకొచ్చింది.  ఇంకా కొంతమంది భారతీయులు వుహాన్ నగరంలోనే ఉండిపోయారు.  వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇండియా కొన్ని రోజులుగా చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది.  అంతేకాదు, చైనాకు సహాయ సహకారాలు అందించేందుకు కూడా ఇండియా ముందుకు వచ్చింది.  


కానీ చాలా రోజులుగా చైనా ఈ విషయాన్నీ పెండింగ్ లో పెడుతూ వచ్చింది.  ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో ఇండియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం వుహాన్ వెళ్ళింది.  అక్కడ అధికారులకు ఇండియా నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్, ఇతర వస్తువులను అందించింది.  ఆ తరువాత అక్కడ ఉన్న 76 మంది భారతీయులను ఇండియాకు తరలించింది.  భారతీయులతో పాటుగా మరో 36 మంది విదేశీయులను కూడా అధికారులు ఇండియాకు తరలించారు.  


ఇక ఇదిలా ఉంటె, చైనా నుంచి మాత్రమే కాకుండా, అటు జపాన్ లోని డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో ఉన్న భారతీయులను కూడా ఇండియన్ ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది.  డైమండ్ ప్రిన్సెస్ షిప్ లోని 119 మంది భారతీయులను మరో ఐదుగురు విదేశీయులను ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఇండియాకు తరలించారు.  వీరంతా ఈ ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు.  అక్కడి నుంచి కొన్ని రోజుల ఆబ్సెర్వేషన్ తరువాత వారి సొంత ప్రాంతాలకు పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: