తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ హీరోలు ఉన్నారు. ఇప్పటికీ సీనియర్ హీరోలు అందరూ రాణిస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అప్పట్లో ఎంతగానో రాణించి  ఆ తర్వాత కనుమరుగైన హీరోలు కూడా చాలామంది ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇలా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ తన నటనతో ఎంతగానో దగ్గరైన హీరో జగపతిబాబు. మావిడాకులు.. హనుమాన్ జంక్షన్ పెద్ద బాబు... కబడ్డీ కబడ్డీ ఇలాంటి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు జగపతిబాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో జగపతి బాబు కు ఉండే క్రేజే సపరేట్. 

 

 

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న జగపతి బాబుకు  ఆ తర్వాత మాత్రం అవకాశాలు అంతగా రాలేదు... ఇక జగపతి బాబు చేసిన కొన్ని సినిమాలు కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో తెలుగు తెరపై పూర్తిగా కనుమరుగై పోయాడు జగపతిబాబు. ఇక జగపతిబాబు మళ్ళీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వలేడు అని అనుకుంటున్న సమయంలో.. అందరికి షాక్ ఇస్తూ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు క్యూట్ గా కనిపించే జగపతిబాబు రౌద్రాన్ని పండించడం మొదలుపెట్టాడు. 

 

 

 దీంతో తన విలనిజం కు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. బాలయ్యతో సినిమా తర్వాత జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లోనే టాప్ విలన్ గా మారిపోయాడు జగపతిబాబు. ఓవైపు క్లాసిక్ లుక్తో విలన్ గా  నటిస్తూనే మరోవైపు రౌద్రంగా... రూపం చూస్తేనే భయపడే విధంగా విలనిజాన్ని పండించాడు. ఇలా అప్పట్లో హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించి హీరో  అనిపించుకున్న జగపతి బాబు ఇప్పుడు విలనిజాన్ని పండిస్తూ హీరో అనిపించుకున్నాడు. ఇలా రెండుసార్లు హీరో అనిపించుకున్న ఘనత కేవలం జగపతిబాబు కే దక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: