మద్యం.. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ... తాగే వారి ఇల్లూ.. ఒళ్ళు గుల్ల చేస్తున్న మద్యం మహమ్మారి పై ఏపీ సీఎం జగన్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు, అలాగే పాదయాత్ర సమయంలో మద్యం కారణంగా ఆయా కుటుంబాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చుసిన జగన్ అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని, ఐదేళ్లలో పూర్తిగా మద్యం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఏపీలో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధీనంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నాడు. అలాగే మద్యం ధరల కూడా చాలా వరకు పెంచారు. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం దొరికేలా జగన్ చర్యలు తీసుకున్నారు. ఇక కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే దొరికేలా.. చేశారు. జగన్ నిర్ణయం కారణంగా ఇప్పుడు మందు తాగే వారి సంఖ్య బాగా తగ్గడమే కాకుండా.. చాలా వరకు కంట్రోల్ గా తాగుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ...

IHG


 జగన్ తీసుకున్న దశలవారీ మద్య నిషేధం పై అసలు తాగుబోతులు ఏమంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. వారి నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. గతంలో తాము పూటుగా మద్యం సేవించామని, కానీ ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో తక్కువ మోతాదులో మద్యం సేవిస్తున్నామని, ఇప్పుడు సమయానికి ఇంటికి వెళ్లడం, కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉందని, అలాగే డబ్బులు కూడా మిగులుతున్నాయి వారు సంతోషంగా చెబుతున్నారు. మరికొందరు మాత్రం పెరిగిన మద్యం రేట్లతో అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నామని, మొన్నటి వరకు కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం తాగేందుకు ఉపయోగించేవారమని,కానీ ఇప్పుడు ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించడం, ఇంట్లో వారు కూడా ఆనందంగా ఉండడం చూస్తుంటే ఇన్నాళ్లు ఎంత తప్పు చేశాము అనే విషయం అర్థమవుతుంది అని వారు చెబుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఇదే రకమైన స్పందన కనిపిస్తోంది.


ప్రజల స్పందన ఈ విధంగా ఉంటే దీనిపైన ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారని, పెరిగిన ధరలతో తాగుబోతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, మనశ్శాంతిగా మందు తాగేందుకు కూడా జగన్ ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదంటూ  రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. తెలుగు దేశం విషయానికి వస్తే గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధించగా.. ఆ తర్వాత టిడిపిని తన ఆధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు తన హయాంలో మధ్య నిషేధాన్ని ఎత్తి వేశారు. ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అంటూ అనవసర ఆందోళన చేస్తున్నారు. దీని కారణంగా ప్రతిపక్షాలపై ప్రజల్లో ఉన్న కొద్ది సానుభూతి కూడా పోతోంది. ఇక ఏపీ సీఎం జగన్ తీసుకున్న దశలవారీ మధ్య నిషేధ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: