కమ్యూనిస్టులు... ఈ దేశంలో పేదల తరపున మాట్లాడే పార్టీలుగా పేరుంది వీటికి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏనాడూ అధికారం అందుకోలేకపోయినా జనం కోసం పని చేసే పార్టీలుగా ఈ వీటికి గతంలో ఆదరణ ఉండేది. ఈ పార్టీల తరపున ఎన్నికయ్యేవారి తక్కువే అయినా జనం సమస్యలపై ప్రభుత్వాలని కడిగేసేవారు. కానీ రాను రాను ఈ పార్టీలు తమ అస్తిత్వం కోల్పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా సొంతం చేసుకోలేని దుస్థితి చేరుకున్నాయి.

 

దీనికి ఆ పార్టీ పెద్ద పార్టీల తోక పార్టీల్లా మారడమే కారణం అన్న వాదన ఉంది. తాజాగా party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు వెనుకే కనిపిస్తూ ఉంటున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనేది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానమైందని, సీపీఐ పార్టీ అంటే గర్వంగా చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ రామకృష్ణ రాజధాని విషయంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.

 

సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ తక్షణమే ప్రకటన చేయాలని ఆర్కే కోరారు. నిజమైన కార్యకర్తలు మన్నించాలని కోరుకుంటూ.. సీఎం నిర్ణయాన్ని రామకృష్ణ వ్యతిరేకిస్తే.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా కాదు.. చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా లీడర్‌గా రామకృష్ణను గుర్తిస్తారని ఘాటుగా కామెంట్ చేశారు.

 

పేదవాడికి సెంట్‌ స్థలం ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లుగా ఎల్లో మీడియాలో, సోషల్‌ మీడియాల్లో చంద్రబాబు విష ప్రచారం చేయిస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. బయట ఎక్కడైనా సరే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూ సేకరణ చేయాల్సి వస్తే మార్కెట్‌ కంటే రూపాయి ఎక్కువ ఇవ్వండి అని కలెక్టర్‌లకు పెద్దమనస్సుతో సీఎం ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సొంతింటి కలను నిజం చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని చంద్రబాబుకు సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: