కొంత మంది ఏమనుకుంటారో ఏమో కానీ ఏది చేసినా చెల్లుద్దని, తెగ రుబాబు చేస్తుంటారు.. అయితే కొన్ని కొన్ని సార్లు చట్టాన్ని కూడా అతిక్రమిస్తారు.. ఇలా చేసిన వారు చివరికి జైలుపాలు కూడా అయ్యారు.. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కించపరిచే విధంగా కామెంట్లు పెడితే కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. అయినా కానీ ఇలాంటి వాటి విషయాల్లో వెనక్కు తగ్గడం లేదు ఆకతాయిలు.

 

 

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు కనిపించడం.. ఇక టిక్‌టాక్‌ల పిచ్చి వల్ల  యువత మరింతగా మితిమీరుతున్నారు.. ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల వారి జీవితాలే రిస్క్‌లో పడిన సందర్భాలున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో యువకుడు చేతి దూలవల్ల చిక్కుల్లో పడ్డాడు.. అదేమంటే..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు చేశారంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

 

 

ఇకపోతే సోషల్ మీడియా ఉన్నది వారిని వీరిని కించపరచడానికి కాదు.. మంచిని నలుగురికి పంచడానికి, చెడుని పదిమందితో చెప్పడానికి కానీ ఇలాంటి ఆయుధాన్ని ఇలా అనవసరంగా చెడుకోసం వాడుతున్నారు నేటికాలంలో యువత.. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటున్న వారు ఒక్క సారి ఆలోచించండి.. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల నష్టాలే గాని లాభాలు రావు..  అనవసరంగా పోలీసు స్టేషన్ చుట్టు తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోకండి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: