టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. జగన్ తొమ్మిది నెలల పాలన నవ మోసాల పాలన అంటూ ప్రజలకు వివరిస్తున్నారు. అయితే చంద్రబాబు యాత్రలపై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదని.. అది పచ్చి బూతుల యాత్ర అని అంటున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు.

 

 

చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నారని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమిని కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి గుర్తు చేశారు.

 

 

అనంతపురానికి వైయస్‌ఆర్‌ నీరు ఇవ్వడం వల్లనే కియా పరిశ్రమ వచ్చిందని, చంద్రబాబు మొహం చూసి కాదని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. చైతన్య యాత్రలో మద్యాన్ని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం చేయాలని గతంలో రామోజీరావు వార్తలు రాసిన విషయాన్ని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. మరి రామోజీరావు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మర్చిపోయారో తెలియదని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

 

 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పాస్ పుస్తం కోసం రూ.లక్ష లంచం ఇచ్చానని ఓ రైతు చెప్పాడని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.. చంద్రబాబు హయాంలో రైతులు ఎంత ఇబ్బంది రైతు మాటల్లో తెలుస్తోంది. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచి నీటి సమస్యను చంద్రబాబు పరిష్కారం చేయలేక పోయారని మండిపడ్డారు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: