కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం ఒణికి పోతోంది. చైనా ఆర్ధిక వ్యవస్థనే కాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కరోనా వైరస్ గడగడ లాడిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మన భారతీయ వ్యవసాయ రంగాన్ని కరోనా వైరస్ లాంటి ఒక పెను భూతం నాశనం చేయబోతోంద అంటూ కొన్ని మీడియా సంస్థలు ఆసక్తికర కథనాన్ని ప్రచురిస్తున్నాయి. 


ఇక వివారలలోకి వెళితే ‘రుగోస్’ అనే కొత్త వైరస్ ఇప్పుడు భారత్ లోనే పండ్ల తోటల్ని నాశనం చేయడానికి సమాయుక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యం పడవలసిన విషయం ఏమిటంటే మన దేశంలో కరోనా వైరస్‌ని మొదట గుర్తించిన కేరళ రాష్ట్రంలోనే ఇప్పుడు ఈ కొత్త వైరస్ ను గుర్తించారు. 


ఇప్పుడు కేరళ నుండి తమిళనాడు అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్‌ కు ఇప్పుడు అక్కడ నుండి తెలంగాణ జిల్లాల్లో పంటలకు సోకుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగగిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో విజయనగరం – శ్రీకాకుళం – విశాఖపట్నం – తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి  కృష్ణ జిల్లాల్లోని కొన్ని వేల  హెక్టార్లలో కొబ్బరి తోటల పై అయిల్‌ పామ్ సాగు పై ‘రుగోస్’ వైరస్ ప్రభావం చూపిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. 

 

అంతేకాదు అరటి జామ సీతాఫలం పండ్ల తోటలను కూడా ఈ వైరస్ నాశనం చేస్తోంది. ఫలితంగా తీవ్రనష్టం జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ ను తొలి దశలో అడ్డుకోలేకపోతే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటలు అన్నీ మాయమైపోయే పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.తెల్లదోమ వల్ల సోకే రుగోస్ వైరస్‌ను ఏపీలో మొదట తూర్పు గోదావరి జిల్లాలోని కడియంలో కొబ్బరి చెట్లపై గుర్తించారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది అయిల్‌ పామ్ చెట్లకు కూడా పాకింది. రుగోస్ వైరస్‌ ను తెస్తున్న తెల్లదోమ మొదట మొక్కలోని రసాన్ని పీల్చి వేస్తుందని ఆ తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మొక్కలు ఎండిపోతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: