మనిషి జీవన ప్రస్తావన అంతా మానవ సంబంధాల చుట్టూ తిరుగుతుంది. ఆత్మీయ బంధాలు కలిగిన వ్యక్తి మానసికంగా చాల ధృడంగా ఉంటాడు. ఒక వ్యక్తికి ఉన్న ఆస్థిపాస్తుల కంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న మానవ సంబంధాలు అతడి విజయానికి కారణం అవుతాయి.


రకరాకాల భావావేశాలు కల వ్యక్తులు ఒకచోట కలిసి పనిచేయడం అంత సులువైన పని కాదు. ఒకపని సమర్థవంతంగా పూర్తి చేయడానికి కేవలం ఒక వ్యక్తి నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. ఒక ప్రాజెక్ట్ సక్సస్ కు అందరి సహకారంతో పాటు అందరి నైపుణ్యాలు కావాలి.


వాస్తవానికి ఏ వ్యక్తి చెడ్డ వాడుగా పుట్టడు. అతడు పెరిగిన వాతావరణం అతడి చుట్టూ ఉండే పరిస్థితులు అతడికి జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు లాంటి ఎన్నో కారణాలు ఒక మనిషిని మంచి వాడిగా చెడ్డ వాడిగా మారుస్తాయి. అందుకే మనుషులతో వ్యవహరించడం అంటే ఒక గని లోంచి బంగారం వెలికి తీయడం కన్నా కష్టం అని ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆండ్రూ కార్నెగీ అనేకసార్లు చెపుతూ ఉంటారు.


ఒక కిలో బంగారాన్ని బయటకు తీయాలి అంటే కొన్ని వేల టన్నుల మట్టిని ముందు వెలుపలకు తవ్వాలి. అలాగే ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అతడిలో ఉండే అనేక నెగిటివ్ లక్షణాలను తొలిగించుకుంటే తప్ప లోలోపల ఉండే పాజిటివ్ లక్షణాలు బయటకు రావు. అందుకోసమే ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ముందుగా తన మంచితనాన్ని అందరికీ పంచాలి. ముఖంలో ప్రశాంతంగా  ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి మాత్రమే విజయం సాధించి ధనవంతుడు కాగలుగుతాడు. ప్రతి వ్యక్తిలో ఉండే బలహీనతలు దుర్గుణాలు పక్కకు పెట్టి ఆ వ్యక్తిని తనలోని మంచిని గుర్తింప చేసే స్థాయిలో ప్రభావితం చేయగల మాటలను చెప్పగల వ్యక్తికి మాత్రమే విజయం వచ్చి చేరుతుంది. ఆవిజయం తరువాత మాత్రమే ఐశ్వర్యం వస్తుంది. అందుకే మానవ సంబంధాలు సంపదకు మూలం.

మరింత సమాచారం తెలుసుకోండి: