తాజాగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు అడ్డుకునేందుకు భారీ మొత్తంలో వైసీపీ నేతలు విశాఖ ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో అటు భారీ మొత్తంలో టీడీపీ శ్రేణులు కూడా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని చంద్రబాబు కు మద్దతుగా నిలిచారు. 

 

 

వైసీపీ  కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు తప్పుబడుతూ ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముందే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక పోటాపోటీ నినాదాలతో విశాఖ విమానాశ్రయం ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. ఓవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గో బ్యాక్ చంద్రబాబు.. విశాఖపట్నానికి రావద్దు అంటూ నినాదాలు చేస్తుంటే మరోవైపు.... చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ మొత్తంలో మోహరించారు. 

 

 

 అయితే ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక ఈ రెండు గ్రూపులు విడగొట్టారు పోలీసులు. ఇక  విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోకి బయటి వారిని వారిని అనుమతించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎన్ని అవాంతరాలు సృష్టించిన తాను మాత్రం ప్రజా చైతన్య యాత్ర చేసి తీరుతానని విశాఖలో వైసిపి భూ కుంభకోణం గురించి రైతులను కలుస్తాను అంటూ చంద్రబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: