ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించి  దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తోంది. అయితే దీనిపై టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వడం ఏమిటని అది కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అమరావతిలో ఇల్లు కేటాయించడం ఏమిటి అనే దానిపై టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిరుపేదలకు ఇళ్ల పట్టాల కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

 నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంచుతాం అంటే ఎవరూ కాదనరు అంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్.. నిర్దేశిత అవసరాల కోసం తీసుకున్న భూమిని నిరుపేదలకు కేటాయించడం ద్వారా అది వివాదాస్పద భూమి గా మారిపోతున్నదని  దీంతో ఆ భూమి పేదలకు దక్కకుండా పోతుంది అంటూ  పవన్ కళ్యాణ్ తెలిపారు. పాఠశాలలు శ్మశానవాటికలు ఇలా వివిధ నిర్దేశిత అవసరాల కోసం కేటాయించిన భూమిని మాత్రం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు రూపంలో ఇవ్వకూడదు అంటూ డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

 

 

 అయితే... వివాదాస్పద భూముల్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం వల్ల..ఆ  భూమి వారికి చెందకుండా పోతుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణంలో కి వచ్చేలా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం అమరావతిలో భూములు ఇచ్చామని రైతులు నిరసన తెలుపుతుంటే భూములను ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి ప్రజల మధ్య సరికొత్త వివాదాన్ని రగిలించటమే  అన్నది ప్రతి పక్షాల వాదన. అయితే అమరావతిలో భూమిని ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదని ఎక్కడా లేదని.. ప్రభుత్వం ఇష్ట ప్రకారం ఈ భూములను పంచవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: