భార్య అంటే భర్తలో సగభాగం.  కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లిరోజున ప్రమాణం చేసిన తరువాత అమ్మాయిని భర్త చేతుల్లో పెడతారు.  కానీ, చాలామంది ఏం చేస్తున్నారు.  దారుణాలు చేస్తున్నారు. కట్టుకున్న భార్యకు నరకం చూపిస్తున్నారు.  ఎంతదారుణంగా మారిపోతున్నారు అంటే... భార్యను ఇబ్బందులు పెట్టడం, భార్యను నరకయాతనలకు గురి చేయడం వంటివి చేస్తున్నారు.  


ఇలా చేస్తూ సంతోషం పొందుతున్నారు. పొట్టకూటి కోసం వనపర్తి జిల్లా నుంచి ఓ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది.  అలా వలస వచ్చిన కుటుంబం రోజువారీ కూలి చేసుకొని బ్రతుకుతున్నారు.  అలా బ్రతుకును వెళ్లదీస్తున్న ఆ కుటుంబంలో కొన్నాళ్లుగా కలతలు రేగుతున్నాయి.  ఈ కలతలా కారణంగా ఇబ్బందులు వచ్చాయి.  భార్యపై భర్త అనుమానం పెంచుకున్నారు.  


ఈ అనుమానంతో రోజు కొట్టడం మొదలుపెట్టారు.  ప్రతిరోజూ చిత్రహింసలు పెట్టేవాడు.  అక్కడితో ఆగకుండా ఓరోజు తలపై ఇనుప రాడ్ తో కొట్టారు.  అంతేకాదు, ఇనుప రాడ్ ను ఎర్రగా కాల్చి మహిళా ఒంటిపై వాతలు పెట్టాడు.  ఆ తతంగాన్ని వీడియోగా చిత్రీకరించారు.  అయితే, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.  


పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ చేసింది.  పోలీసులు ఆమె పరిస్థితి చూసి షాక్ అయ్యారు.  వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.  ఈ చికిత్స అనంతరం ఆమె దగ్గరి నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయి.  ఈఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  భర్తపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచుగా జరగకుండా అడ్డుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా సరే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా హామీ ఇవ్వడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: