జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో కి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం.... రాజధాని అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించింది జగన్ సర్కార్. అయితే దీనిపై విపక్ష టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల కేటాయింపు ఏమిటి అని విమర్శలు చేస్తోంది. ఇప్పటికే డిఫెన్స్ లో  ఉన్న టిడిపి పార్టీ.... ఇలాంటి విమర్శలతో ప్రజల్లో మరింత  వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్నట్లు  తెలుస్తోంది. అయితే ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అనేలా జగన్ సర్కార్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 

 


 ప్రస్తుతం అమరావతిలో 50 వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెబితే... అమరావతిలో నిరుపేదలకు ఇల్లు ఏంటి అని టీడీపీ అంటుంది.... ఈ నేపథ్యంలో అమరావతిలో నిరుపేదలకు చోటు లేదా అనే భావన ప్రజల్లో కలుగుతోంది. దీంతో ఇప్పటికే అయోమయం లో ఉన్న  టిడిపి పార్టీకి ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఇక మరోటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధానిని తరలిస్తామని ప్రకటన చేసినప్పటి నుంచి... అమరావతి రైతులు జగన్ సర్కార్ పై వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీ పార్టీకి ఎన్నికల్లో ఓట్లు తక్కువ పడే అవకాశం ఉంది. 50వేల మంది లబ్ధిదారులకు అమరావతి లో ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా అమరావతిలో వైసీపీకి వచ్చే ఓట్లు కూడా ఈక్వల్ గా చేయొచ్చు అని యోచనలో జగన్ సర్కార్  ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 అంతే కాకుండా... అమరావతి ప్రాంతంలో విజయవాడ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి భూములు ఎలా కేటాయిస్తారు అని టిడిపి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. అయితే గతంలో టిడిపి అమరావతి అంటే చూపిన లెక్కల ప్రకారం విజయవాడ గుంటూరు సహా మరికొన్ని నగరాలు కూడా అమరావతిలో కి చెందినవి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతాలను ఇతర ప్రాంతాలు అని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది అంటే... అక్కడే టీడీపీ డొల్లతనం బయట పడి పోతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు టీడీపీ నిజస్వరూపం తెలిసి పోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే 50,000 మంది నిరుపేద కుటుంబాలకు అమరావతి లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వైసీపీ సర్కార్ ప్లాన్ చేసిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: