టిక్ టాక్ లో అప్లోడ్ అవుతున్న వీడియోలలో వికృత చేష్టలు రోజు రోజుకి హద్దులు దాటిపోతున్నాయి. ఇప్పటికే టిక్ టాక్ లో లైకుల కోసం ఎంతోమంది పిచ్చి స్టంటులు చేసి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఒక వ్యక్తి టిక్ టాక్ స్టంట్ అంటూ ప్రయాణిస్తున్న రైలు డోర్ కి వేలాడుతూ కిందపడ్డాడు. అదృష్టవశాత్తు రైలు చక్రాలు కింద అతడు పడలేదు కానీ ఒకవేళ పడిన్నట్లయితే తల తెగిపోయేది. కానీ చాలామంది ఇంతకంటే బుద్ధి తక్కువ స్టంటులు చేసి తమని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. ఐతే నిన్నటివరకు మనకి ప్రాణాలు పోగొట్టుకునే పిచ్చిని చూపిన టిక్ టాక్ యూజర్లు... ఇప్పుడు తల్లి, చెల్లె, అక్క అంటూ వారి పైన మరో టిక్ టాక్ పిచ్చి స్టంటులు చేసి అందరి అసహ్యానికి, ఆగ్రహానికి కారణం అవుతున్నారు. 

 

వివరాలు తెలుసుకుంటే... ఐడెన్ అనే పేరు గల ఓ 17 ఏళ్ల కుర్రాడు తన కన్న తల్లిని తనకు ఎదురుగా నిల్చోబెట్టి ఒక ఇంగ్లీష్ పాట ని ప్లే చేయసాగాడు. ఆ తరువాత టిక్ టాక్ వీడియో తీస్తూ డాన్స్ వేయడం ప్రారంభించాడు. ఆపై తనకి ఎదురుగా నిలిచి ఉన్న తల్లి బ్రెస్టు లను టపటపామని చరిచాడు. ఆ వికృత స్టంట్ చేసిన తర్వాత తల్లి కొడుకులద్దరూ నవ్వారు. ఆ తరువాత వీడియో ముగిస్తుంది. అయితే ఈ వీడియోని ఐడెన్ మొట్టమొదటిగా టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు. కానీ ఈ వీడియో లో చూడకూడని స్టంట్ ఉంది కాబట్టి టిక్ టాక్ వెంటనే తొలగించింది. కానీ అప్పటి లోపు ఈ వీడియో ని కొంతమంది డౌన్లోడ్ చేసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. 

 

బ్రాండన్ అనే ట్విట్టర్ యూసర్ ట్విట్టర్ లో 8 సెకన్ల వీడియోని అప్లోడ్ చేయగా... ఇప్పటికే 45 లక్షల నెటిజనులు వీక్షించారు. ఐతే ఇది చూసిన ప్రతి ఒక్కరూ చీదరించుకుంటున్నారు. అమెరికా తల్లులు తమ పిల్లలు ఏం చేసినా ఏమనరని కొంతమంది కామెంట్ చేస్తుండగా... ఇటువంటి బుద్ధిలేని తల్లీ కొడుకులు అన్ని దేశాలలో ఉంటారని మరి కొంతమంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: