ఢిల్లీలో నిత్యవసరాలకు రెక్కలొచ్చాయి. నాలుగు రోజులుగా హింసాత్మ ఘటనలు... ఆ తర్వాత కర్ఫ్యూ విధించడంతో.. రేట్లు అమాంతం పెరిగాయి. 40 రుపాయలు చెల్లించినా అర లీటర్ పాలు దొరకని పరిస్థితి. ఇక కూరగాయాల రేట్లయితే చెప్పనక్కర్లేదు. డబుల్‌ రేట్లు పెట్టి కొందామన్నా... దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

 

దుకాణాలు మూతపడే ఉన్నాయి. సూపర్‌ మార్కెట్లు తెరుచుకోలేదు. రైతు బజార్లు ఖాళీగానే ఉన్నాయి. నాలుగు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న సామాన్లు అయిపోయాయి. నిత్యవసరాలు దేవుడెరుగు...పాలు, నీళ్లకే కష్టమవుతోంది. ఇదీ ఈశాన్య ఢిల్లీవాసుల పరిస్థితి. 

 

నాలుగు రోజులుగా ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ స్తంభించిపోయింది. రోడ్లు నిర్భందంలోకి వెళ్లిపోయాయి. రవాణా పూర్తిగా ఆగిపోయింది. అల్లరిమూక దుకాణాలకు నిప్పుపెట్టడంతో... అవి మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పిస్తున్నా... 144 సెక్షన్‌ విధించడంతో బంద్ వాతారణం కన్పిస్తోంది. దీంతో నిత్యవసర సరుకు రవాణా పూర్తిగా ఆగిపోయింది. దీంతో డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. పాలు, కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి.

 

జాఫరాబాద్, మౌజ్‌పూర్, బాబుర్ పూర్ ప్రాంతాల్లో దుకాణాలను తెరిచినా...త్వరగానే మూసివేస్తున్నారు. దీంతో సరుకులు కొనేందుకు వెళ్లినవారికి నిరాశే ఎదురువుతోంది. మొన్నటి వరకూ 45 నుంచి 50 వరకూ ఉన్న లీటర్‌ పాలు...ఇప్పుడు 80 వరకూ అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఒక కిలోమీటర్ దూరం నడిచి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు.


నిత్యావసరాలు అందుబాటులో లేక ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ తిప్పలు మరికొన్ని రోజులు తప్పేలా కన్పించకపోవడంతో... స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టాయి. నిత్యావసర సరులుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు ఇప్పటికీ మూసి ఉండటంతో.. పాలు, కూరాగాయల ధరలకు రెక్కలొచ్చాయి. దుకాణదారులు రెట్టింపు రేట్లు చెప్పడంతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: