2019 ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్ అత్యధిక మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సమీప టీడీపీ అభ్యర్ధి సతీశ్ రెడ్డిపై దాదాపు 90 వేల పైనే మెజారిటీతో గెలిచారు. అయితే జగన్ తర్వాత ఊహించని విధంగా భారీ మెజారిటీ తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచిన ఎమ్మెల్యే...అన్నా వెంకట రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి రాంబాబు, టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డిపై దాదాపు 81 వేల పైనే మెజారిటీతో గెలిచారు.

 

అయితే అసలు రాంబాబు 2009లో ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పి‌ఆర్‌పి, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, ఆయన 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్లారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గిద్దలూరు నుంచి పోటీ చేసి, అప్పటి వైసీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక, ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి పసుపు కండువా కప్పుకుంటే, రాంబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు.

 

ఇక ఈ ఇద్దరే మళ్ళీ రివర్స్ లో 2019 ఎన్నికల్లో తలపడ్డారు. రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచేశారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడంతో గిద్దలూరు ప్రజలు ఆయనపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఆశలకు తగ్గట్టుగానే రాంబాబు కూడా పని చేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం చేస్తూనే, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలులో కూడా ముందున్నారు.

 

అయితే ఈయన ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చేది నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికే అని మాట్లాడి వివాదం సృష్టించారు. పైగా నియోజకవర్గంలో కూడా ఈయన వన్‌సైడ్‌గా వెళుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ అయిన ఆయన అనుచరులకే దక్కేలా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆరోపణలు ఉన్న నియోజకవర్గ ప్రజలు రాంబాబుపై బాగానే అభిమానం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా టీడీపీ నేత ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి పెద్ద యాక్టివ్‌గా లేకపోవడంతో రాంబాబుకు తిరుగులేకుండా పోయింది. మొత్తం మీదైతే గిద్దలూరులో అన్నా రాంబాబు దూసుకెళుతున్నారనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: