దాదాపు మూడు గంటలుగా చంద్రబాబునాయుడు కాన్వాయ్ లోనే ఇరుక్కుపోయారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని అనుభవం ఎదురవ్వటంతో  చంద్రబాబు షాక్ లోకి వెళ్ళిపోయారు. ఉదయం  11.30  గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకున్నారు. విమానం దిగి లాంజ్ లోకి రావటానికే సుమారు అర్ధగంట పట్టింది. లాంజ్ దాటుకుని విమానాశ్రయం బయటకు వచ్చేసరికి వైసిపి కార్యకర్తలు, కొందరు పబ్లిక్ కూడా  చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డుపడ్డారు.

 

విమానాశ్రయం దాటుకుని పెందుర్తి వైపు నేషనల్ హై వే మీదగా వెళ్ళాల్సిన చంద్రబాబు కాన్వాయ్ చేసేది లేక ఎయిర్ పోర్టు దగ్గరే ఆగిపోయింది. ఒకవైపు టిడిపి నేతలు, కార్యకర్తలు మరోవైపు వైసిపి శ్రేణులు మోహరించటంతో  టెన్షన్ పెరిగిపోతోంది. చంద్రబాబు కాన్వాయ్ ముందు వైసిపి కార్యకర్తలు తమ వాహనాలను అడ్డుపెట్టారు. అంతేకాకుండా తమ కార్లపై ఓ కార్యకర్త పెట్రోలు బాటిల్ ను పెట్టుకుని నిప్పు పెట్టుకుంటానని బెదిరించటంతో గందరగోళం మొదలైంది.

 

సరే పోలీసులు జోక్యం చేసుకుని ఆ కార్యకర్తను కారుపై నుండి దింపేసినా గందరగోళమైతే కంటిన్యు అవుతోంది. అంటే దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు తన కారులోనే కూర్చుండిపోవాల్సొచ్చింది. చంద్రబాబు కారుపైకి ఆందోళనకారులు చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు.  మామూలుగా ఎయిర్ పోర్టు నుండి నేషనల్ హై వే మీదకు చేరుకోవటానికి 3 నిముషాలకన్నా పట్టదు. అలాంటిది 3 గంటలుగా చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారీ కాన్వాయ్ తో వెళ్ళేందుకు లేదని మొదటి నుండి పోలీసులు టిడిపి నేతలకు చెబుతున్నా వాళ్ళెవరూ పట్టించుకోలేదు. దాంతో సమస్య పెరిగిపోయింది. బహుశా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తన కారులోనే చంద్రబాబు కూర్చునేయటం ఇదే మొటిసారేమో. అందుకే పోలీసుల వైఖరికి నిరసనగా చంద్రబాబు ఒక్కసారిగా తన కారులో నుండి బయటకు వచ్చి అక్కడే రోడ్డుపై బైఠాయించటంతో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: