చేసిన పాపాలు ఊరికే పోవు అంటారు.ఎవరి ఖర్మకు వారే బాధ్యులు అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలిసొస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్ ను ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేసాడో, అదేరకమైన పరిస్థితి చంద్రబాబుకి కూడా ఇప్పుడు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే అప్పుడు రాజకీయ కక్షలతో చంద్రబాబు జగన్ ను ఇబ్బంది పెడితే ఇప్పుడు చంద్రబాబు కి ఉత్తరాంధ్ర ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.  తాజాగా ప్రజా చైతన్య యాత్ర పేరుతో టీడీపీకి మైలేజ్ పెంచేలా, ప్రబుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు యాత్ర చేసేందుకు విశాఖకు చేరుకోగా ఆయనకు స్థానిక ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి. 

 

IHG

అమరావతి ముద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ  చంద్రబాబు గత కొంత కాలం నుంచి గట్టిగా ఆందోళనలు చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చి చంద్రబాబును వైసిపి కార్యకర్తలు, ప్రజలు అడ్డుకుని  ఆందోళనకు దిగడంతో విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో చంద్రబాబు నిలిచిపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రోడ్డుమీద ఆందోళనకారులు బాబు కాన్వాయికి అడ్డుగా పడుకోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. గతంలో ఇదే రకమైన పరిస్థితి జగన్ విషయంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు చేయించారు. 

 

2017 జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.  కానీ అక్కడ భద్రత కారణాలుగా చూపిస్తూ పోలీసులు జగన్ ను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఎయిర్ పోర్ట్ లోనే తన నిరసనను తెలియజేశారు. జగన్, విజయసాయి రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రన్ వే పై భైఠాయించారు. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి చంద్రబాబుకు తలెత్తడంతో చేసిన పాపం ఊరికే పోదు కదా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: