టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనపై ఇప్పుడు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. విశాఖలో ఆయనకు ప్రజల నుంచి, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఆయన ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విశాఖలో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు చంద్రబాబుకు విశాఖలో ఈ పరిణామాలు ఎదురవుతాయి ముందుగా ఊహించినా విశాఖ పర్యటన చేపట్టడానికి కారణాలు చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, కర్నూలు, విశాఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా అంగీకరించే పరిస్థితి లేదని చంద్రబాబు మొదటి నుంచి చెప్పుకుంటున్నారు. విశాఖ కు వస్తే ఈ స్థాయిలో నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం అవుతాయి అని ముందుగానే బాబు ఊహించాడు. దానికి అనుగుణంగానే విశాఖ ప్రజా చైతన్య యాత్రలో, తాను చెప్పాలనుకున్న విషయాలను ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. 


ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు యాత్రను విశాఖలో సాగనివ్వకూడదని అధికార పార్టీ కూడా అదే స్థాయిలో పంతం పట్టింది. చంద్రబాబు పర్యటన విశాఖలో సక్రమంగా సాగిపోతే అమరావతి పై చంద్రబాబు చెబుతున్నట్టుగా మిగతా ప్రాంతాల్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు అనే విషయం తేటతెల్లం అవుతోందని ప్రభుత్వం భావించింది. అందుకే పూర్తిస్థాయిలో చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అసలు విశాఖలో చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు అంటే... విశాఖలో రాజధాని పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని, ఇప్పటికే వైసిపి నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని బాబు ఆరోపణలు చేయాలనుకున్నారు.

 

IHG


 ఉత్తరాంధ్ర కు తాను ఇప్పటివరకు ఎంతో చేశానని, తన హయాంలో ఎన్నో సంస్థలు విశాఖకు తీసుకువచ్చామని, అలాగే హుదూద్ తుఫాను సమయంలో తను ఏ విధంగా ఇక్కడ ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాను అనే విషయాలను చంద్రబాబు ప్రజలకు చెప్పాలనుకున్నాడు. అలాగే అదానీ గ్రూప్, లాలూ గ్రూప్ లను కూడా విశాఖ కు తీసుకువస్తే వైసీపీ ఆందోళన చేసి వారిని వెళ్లగొట్టిన విషయాన్ని కూడా చంద్రబాబు తన పర్యటనలో చెప్పాలనుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్న అక్రమాల ఆధారాలను సేకరించి ప్రజల ముందు పెట్టాలని చూశారు. ప్రజల కోసం తాను ఈ విధంగా పోరాటం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా తమ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందో, వేధింపులకు గురి చేస్తుందో ఇలా అనేక అంశాలను తన యాత్రలో చెప్పుకోవాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: