సాధారణంగా మన దేశంలో పురాతన ఆలయాల్లో ఇప్పటికీ గుప్త నిధులు ఉన్నాయని అంటుంటారు. కొన్ని పురాతన  ఆలయాల నేలమానిగల్లో కోట్ల సంపద దాగి ఉంటుందని అందుకోసం తవ్వకాలు కూడా జరుపుతుంటారు.  రాజుల కాలంలో ఎవరైనా ఆక్రమణకు వచ్చినపుడు వారి దేశ సంపద కొన్ని గుప్త స్థానాల్లో పదిల పరిచేవారని.. వారు రాజ్యం గెలిచిన తర్వాత తిరిగి ఆ సంపద తీసుకునే వారని చెబుతుంటారు.  ఈ క్రమంలో రాజ్యం కోల్పోయిన వారు ఆ సంపద విషయం గోప్యంగానే ఉంచడంతో ఇప్పుడు కొన్ని తవ్వకాల్లో గుప్త నిధులు బయట పడుతున్నాయి.  అయితే ఈ గుప్త నిథుల కోసం కొంత మంది దారుణంగా మనుషులను సైతం బలి ఇస్తుంటారు. 

 

తాజాగా తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు నిన్న తవ్వకాలు జరిపారు. కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. వారికి ఇనుముతో చేసిన కుండ తగిలింది.  ఆ కుండను వెలికి తీసి చూడగా.. అందులో 505 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ అధికారులు శ్రీరంగం తహసిల్డార్‌ ఆర్‌. శ్రీధర్‌కు సమాచారం అందించారు. తహసిల్దార్‌ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ లెక్కన వీటి మార్కెట్ రేటు విలువ రూ.70 లక్షల దాకా ఉంటుంది. 

 

కానీ ఇవి పురాతన నాణేలు కదా. వీటిని వేలం వేస్తే మాత్రం విలువ రూ.కోట్లలో ఉండే ఛాన్సుంది. అయితే ఈ బంగారు నాణేలను ఆర్కియాలజీ అధికారులకు అప్పగిస్తామని తహసిల్దార్‌ చెప్పారు. ఏది ఏమైనా ఇది ప్రభుత్వ అధికారుల సమక్షంలో బయట పడటంతో విషయం బయటకు పొక్కింది.. లేదంటే అత్యంత విలువైన సంపద ప్రైవేట్ వ్యక్తుల సొంతం అయి ఉండేది.  ఏడు అడుగుల లోతులో ఇవి బయటపడ్డాయని చెప్పారు. హిందూ మత సంఘాలు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వీటిని పోలీసులకు అందజేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ నాణేలను ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నాణేలపై అధ్యయనం జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: