సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు సంగతి తెలిసిందే. ఈ ఆందోళన రెండు మతాల మధ్య సమస్యగా మారడంతో ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఈ ఆందోళనలు కారణంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి. దాదాపు 20 మంది వరకు ఈ సంఘటనలో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలపై టెన్షన్ పెరిగిపోతోంది. సాక్షాత్తు దేశ రాజధానిలో ఇటువంటి వ్యవహారం చోటుచేసుకోవడం దురదృష్టకరమే అయినా ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం మానేసి రాజకీయ కోణంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుంటూ మరింతగా ఈ సమస్యను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ మరింత అగ్గి రాజేస్తున్నారు. 


ఢిల్లీ అల్లర్ల వెనుక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రమేయం ఉందని బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. 
ఆప్ పార్టీ నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ హుస్సేన్ ఫోన్ కాల్ వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఢిల్లీలో హింస జరిగినప్పుడు హుస్సేన్ ఫోన్ కాల్ వివరాలను బయటికి వెల్లడిస్తే ఈ అల్లర్లు వెనుక, అలాగే  ఐబీ అధికారి రోహిత్ శర్మ హత్య వెనుక సీఎం కేజ్రీవాల్ పాత్ర ఉందనే విషయం బయట పడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.


 ఈ కేసు నుంచి జహీర్ హుస్సేన్ ను కాపాడేందుకు కేజ్రీవాల్ తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ కపిల్ మిశ్ర పేర్కొన్నారు. నిన్ననే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి శర్మ మృతదేహం డ్రైనేజీలో దొరికిందని, దీని వెనుక హుస్సేన్ హస్తం ఉందని, ఆయన తరచుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సంప్రదింపులు చేస్తున్నాడని ఆరోపించారు. హుస్సేన్ రోహిత్ శర్మ తో పాటు మరో ముగ్గురిని లాక్కెళ్లాడని, వారిలో ముగ్గురు చనిపోయారు అని, ఢిల్లీ అల్లర్ల వెనక మొత్తం ఢిల్లీ ప్రభుత్వం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: