పాకిస్తాన్ కు నమ్మకమైన స్నేహితుడు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు చైనాయే. అంతగా ఆదేశాల మధ్య స్నేహం ఉంది. భారత్ పై రెండు దేశాలకూ ఉన్న ద్వేషం కూడా ఈ స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పొచ్చు. అందుకే పాకిస్తాన్ కు ఎప్పుడు సాయం అవసరం వచ్చినా ముందు చైనా వైపు చూస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

 

 

కాకపోతే.. ఇప్పుడు పాకిస్తాన్ కు వచ్చిన కష్టం మనుషులతో, దేశాలతో కాదు.. మిడతలతో.. అవును.. పాకిస్తాన్ ను మిడతల దండు ముప్పు తిప్పలు పెడుతోంది. విపరీతంగా పెరిగిపోతున్న మిడతల దండులు.. పాక్ పంటలను భారీ స్థాయిలో పాడు చేస్తున్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక.. పాకిస్తాన్ తలపట్టుకుంటోంది. ఈ సమయంలో నమ్మకమైన మిత్రుడు చైనా రంగంలోకి దిగబోతోంది.

 

 

పాకిస్తాన్ లోని మిడతలను కట్టడి చేసేందుకు చైనా ఆ దేశానికి ఓ వింత సైన్యాన్ని పంపించబోతోంది. ఆ సైన్యం ఏంటో తెలుసా.. అదే బాతు సైన్యం. అవును. మిడతలను తినేందుకు బాతులను చైనా పంపించబోతోంది. ఎన్ని బాతులో తెలుసా.. దాదాపు లక్ష వరకూ బాతులను చైనా పాకిస్తాన్ పంపించేందుకు నిర్ణయించింది. మిడతలపై పోరాటంలో పాక్‌కు సాయం చేసేందుకు లక్ష బాతుల ఆర్మీని పంపించనున్నట్లు చైనా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

 

గతంలో ఇలాగే మిడతల సమస్య ఎదుర్కొన్న చైనా.. అప్పటి నుంచి భారీ సంఖ్యలో బాతులను పెంచుతోంది. ఒక్కో బాతు రోజుకు కనీసం 200 మిడతలను తినేస్తాయట. మిడతలను అరికట్టేందుకు రసాయనాలు, ఎరువులు ఉపయోగించొచ్చు. కానీ దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే చైనా ఈ బాతు సైన్యాన్ని ఉపయోగిస్తోంది. ఇప్పుడు మిత్రుడికీ అదే సైన్యాన్ని పంపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: