ఈ మద్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు ఇప్పుడు గ్రామాల వెంట, పట్టణాల్లో సైతం వస్తున్నాయి.  అడవులు నరకడం వల్ల వాటి ఆహారం కొరత వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.  కొన్ని సార్లు క్రూర మృగాలు మనుషులపై కూడా దాడులు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు మనుషుల మద్యకు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థం అవుతుంది.  తాజాగా ఓ స్కూల్లో చిరుత పులి చేసిన హల్ చల్ కి గుండె గుభేల్ అయ్యింది.  అక్కడ విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసి గదిలో దాక్కున్నారు.

 

ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా గడిపేస్తున్న పిల్లలకు గాండ్రింపు శబ్దం వినిపించింది. మొదట్లో ఎవరో అలా అరిచారని తేలిగ్గా తీసుకున్నారు. అక్కడ ఏంటా అని చూసిన తర్వాత విద్యార్థులు నిశ్చేష్టులు అయ్యారు. తమకు ఎదురు గా ఉన్నది నిజమైన చిరుత అని చూసి పై ప్రాణాలు పైకే పోయాయి.  వెంటనే పక్కనే ఉన్న గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు.  పులి అటూ ఇటూ తచ్చాడింది. చివరికి అక్కడే తిరుగుతున్న ఓ కుక్కను లటుక్కున పట్టుకుని ఈడ్చుకునిపోయింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కీరాత్పూర్ గ్రామంలోని పాఠశాలలోకి బుధవారం సాయంత్రం చిరుత చొరబడింది. పిల్లలు అప్రమత్తమై గదుల్లోకి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

 

అయితే అక్కడ ఉన్న ఓ కుక్కును పులి తన నోట కరచి పక్కనే ఉన్న అడవుల్లోకి వెళ్లింది. స్కూలు ప్రధానోపాధ్యాయురాలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి మళ్లీ రావొచ్చనే అనుమానంతో ఇద్దరు పోలీసులను అక్కడ కాపలాగా ఉంచారు. అయితే తమ పాఠశాలలో ఇదే మొదటి సారి జరిగిందని.. విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారని ప్రధానోపాధ్యాయులు అన్నారు. దీనిపై జాగ్రత్తలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: