చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో పర్యటించేందుకు సిద్దం అవ్వగా..  చంద్రబాబుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎయిర్ పోర్టుకు చేరుకోగానే  గోబ్యాక్ చంద్రబాబు అంటూ భారీ మొత్తంలో వైసీపీ నేతలు అందరూ అడ్డుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు భారీ మొత్తంలో టిడిపి నేతలు కూడా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించిన విశాఖపట్నం పర్యటన చేస్తాను అంటూ చంద్రబాబు తెలిపారు. అది తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తుగా అరెస్టు చేసేందుకు  పోలీసులు నోటీసులు  ఇచ్చారు. 

 

 

 విశాఖ పర్యటనకు ముందు అనుమతి తీసుకున్న కూడా తన పర్యటన ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటూ చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు.. ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చంద్రబాబు కు నోటీసులు  ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీ భద్రత దృశ్య మిమ్మల్ని మీ అనుచరులను  సి ఆర్ పి ఎస్ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్టు చేస్తున్నామంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఈ ముందస్తు అరెస్టుకు  మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాము  అంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. 

 

 

 నోటీసులు ఇచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ కు తరలించారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ లేదా విజయవాడ పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ మీద కోడిగుడ్లు చెప్పులు వాటర్ బాటిల్ తో దాడి చేశారు అంటూ తెలిపిన చంద్రబాబు నాయుడు తనకు ఎదురైన పరిస్థితి ప్రజలకు కూడా ఎదురవుతుంది అంటూ తెలిపారు. విశాఖ విజయనగరం పర్యటనకు ఇప్పటికే అనుమతి తీసుకున్నానని కానీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అరెస్టు చేసుకోండి అంటూ పోలీసులతో తెలిపిన చంద్రబాబు కానీ ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారో ముందుగా నోటీసులు ఇవ్వండి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: