ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి 10 నెలలు దాటేసింది. అయితే సార్వత్రిక ఎన్నికలు జరిగిన, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఇంకా జరగలేదు. అయితే స్థానిక ఎన్నికలు ఎప్పుడో సార్వత్రిక ఎన్నికల ముందే జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం భయపడి ఎన్నికలని జరపకుండా తప్పించుకుంది. నెగిటివ్ ఫలితాలు వస్తాయనే భయంతో స్థానిక సమరాన్ని పక్కనబెట్టేసింది.

 

ఇక కొత్తగా జగన్ ప్రభుత్వం కూడా వచ్చి 9 నెలలు కావొస్తుంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్...స్థానిక ఎన్నికలని నిర్వహించడానికి సిద్ధమైతే, రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడం వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వస్తున్నాయి. అయితే ఏదేమైనా మార్చి నెలలో మాత్రం స్థానిక ఎన్నికలు జరగడం ఖాయమని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసేశారు. దీంతో వైసీపీ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కూడా క్లీన్‌స్వీప్ చేయాలని వ్యూహాలు రచిస్తుంది.

 

అటు ప్రతిపక్ష టీడీపీ కూడా స్థానిక సమరాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతూ, జగన్ ప్రభుత్వం వైఫల్యాలని వివరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానికంలో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే రాయలసీమలో ఉన్న ఐదు కార్పొరేషన్‌లని గెలవాలని వైసీపీ చూస్తుంటే, ఎక్కడొక చోట వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ స్కెచ్ వేస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాలో  ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 స్థానాలని గెలుచుకుంటే, టీడీపీ 3 చోట్ల మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే.

 

ఇక దీనిబట్టి చూస్తే వైసీపీ సీమలో ఉన్న అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లని కైవసం చేసుకోవడం ఖాయం. అయితే వీటిల్లో టీడీపీకి ఒక్క చోట కూడా గెలిచే ఛాన్స్ లేదు కానీ, అనంతపురంలో మాత్రం కాస్త పోటీ ఇవొచ్చు. అనంతపురంలో టీడీపీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉండటం వల్ల పోటీలో నిలిచే అవకాశం ఉంది. కాకపోతే టీడీపీ ఎంత పోటీ ఇచ్చిన చివరికి అనంతపురం కూడా వైసీపీ వశమే అవుతుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: