పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టుగా తయారయ్యింది ఏపీలో ఓ వర్గం మీడియా పరిస్థితి. చంద్రబాబును అదేపనిగా హైలెట్ చేయాలని చూస్తూ ఉండే టీడీపీ అనుకూల మీడియా ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే చంద్రబాబు తన పార్టీ కోసం, తన సొంత ప్రయోజనాల కోసం చేసే కొన్ని రకాల వ్యవహారాలను కూడా ప్రజల కోసం పాటు పడుతున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల్లో చులకన అవ్వడం సర్వసాధారణంగా మారింది. అన్ని ప్రధాన మీడియాలు ఈ విధంగా లేకపోయినా టీడీపీ ముద్ర వేయించుకున్న కొన్ని ఛానెల్స్ మాత్రం తమ కులాభిమానాన్ని చూపించేందుకు నానా హైరానా పడిపోతుంటాయి. 


 ఇక విషయానికి వస్తే చంద్రబాబు రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా పోరాట యాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని, విశాఖను రాజధానిగా అంగీకరించను అని మొదటి నుంచి చెబుతూ వస్తున్న బాబు ఇప్పడు విశాఖలో పర్యటించేందుకు ప్రయత్నించడం.. ఆ పర్యటనను ముందుకు వెళ్లకుండా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు అడ్డం పడటంతో చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగించే తీరుతానని ఎక్కడ వెనక్కి తగ్గేది లేదంటూ ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని రాజకీయంగా టిడిపికి మైలేజ్ పెరిగేలా చేసుకోవాలని, ప్రజల్లోకి వచ్చి నిజాలు చెబుతనంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పే ప్రయత్నం చేశారు.


బాబు యాత్రకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విశాఖ ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంచ్ కి తీసుకువెళ్లారు. అయితే దీనిని కూడా టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేసుకునేందుకు ప్రయత్నించింది. చంద్రబాబును అరెస్టు చేశారని, ఆయన సమాచారం లేదని, బ్రేకింగ్ న్యూస్ లు వేస్తూ  గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంచ్ కు తీసుకు వెళ్లామని పోలీసులు ఒకవైపు చెబుతున్నా... చంద్రబాబుకు జరగరానిది ఏదో జరిగిపోయింది, ఆయన సమాచారం లేదని టీడీపీ అనుకూల మీడియా అదే పనిగా హడావుడి చేస్తూ ప్రజల్లో మరింత అభాసుపాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: