చంద్రబాబుకు బాకీలు ఉండడం అలవాటు, జగన్ కి బాకీలు చెల్లించడం అలవాటు, అందుకే ఆయన హమీలన్నీ కూడా వరసగా తీరుస్తున్నారు. రుణం ఆయన అట్టే ఉంచుకోరు. అందుకే ఆయన బాబు బాకీని కూడా చాలా తొందరగా తీర్చేశారు. ఇంతకీ ఈ బాకీ ఏంటి.. ఏంటా ముచ్చట అన్నదే కదా. ఆ గుట్టూ అంతా విశాఖ ఎయిర్ పోర్టు కే తెలుసు.


ఫ్లాష్ బ్యాక్ లోకి గిర్రున‌ వెళ్తే సరిగ్గా మూడేళ్ళ క్రితం 2017 జనవరి 26 రిపబ్లిక్ వేళ జగన్ విశాఖలో ప్రత్యేక హోదా మీద క్యాండిల్ ర్యాలీకి వచ్చారు. నాడు ఏపీకి తిరుగులేని చక్రవర్తి చంద్రబాబు. ఆయన తాను జగన్ని ఎట్టిపరిస్థితుల్లో ర్యాలీ చేయనివ్వకూడదనుకున్నారు. అంతే జగన్ని విశాఖ ఎయిర్ పొర్టు  నుంచి కదలనీయకుండా చేసి నాడు చంద్రబాబు సర్కార్ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు, శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటామని కోరినా కూడా జగన్ని వదిలిపెట్టలేదు.

 

సీన్ కట్ చేస్తే  ఓడలు బళ్ళు అయ్యాయి. చంద్రబాబు విపక్ష నేత అయ్యారు. ఆయన విశాఖలో ప్రజా చైతన్య యాత్ర అనుకుంటూ హుషారుగా వైజాగ్ వచ్చారుఇ. ఆయన ఎయిర్ పోర్టులో ఇలా దిగారో లేదో ఆయనకు విశాఖ జనం నిరసన సెగ గట్టిగా తగిలింది.  విశాఖలో రాజధాని ఎందుకు అంటూ బాబు గత కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ తో విసిగిన జనంఎయిర్ పొర్టు  కు వచ్చి అడ్డుకున్నారు

 

దాంతో బాబు టూర్ ఇక సాగదని పోలీసులు చెప్పి మరీ ఆయన్ని అరెస్ట్ చేశారు. దాంతో వీఐపీ లాంజిలో బాబు ఉండిపోవాల్సివచ్చింది.  ఆ వీఐపీ లాంజ్ ని చూస్తే బాబుకు ఠక్కున గతం గుర్తుకు వచ్చింది. అంతే కాదు,  దీనిమీద విలేకరులు బాబుకు గతంలో జగన్ని అరెస్ట్ చేసిన ఘటనను గుర్తు చేయగా బాబు అపుడు వేరు, ఇపుడు వేరు అంటూ సమాధానం దాటవేయడం గమనార్హం. 

 

మొత్త్తానికి జగన్ జనాలకే కాదు బాబు మొక్కు కూడా తీర్చేసుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. బాబు తాజా స్థితిని  చూసిన వారు కూడా  ఎవరు చేసుకున్న పాపం వారినే వెంబడిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బాబు బాకీ కూడా తీర్చేసుకుని జగన్ తాను ఎవరికీ రుణం లేనని నిరూపించుకున్నారు.

 

జగన్ తన హామీలను కానీ, బాకీలను కానీ తీర్చలేదని ఇపుడు ఎవరైనా అనగలరా. అందరూ ఎందుకు బాబు అసలు అనగలరా. బాబును కూడా గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా అన్నీ తీర్చేస్తున్న జగన్ని చూసి రాజకీయ గండర గండడు బాబు సైతం ఇపుడు ఏం సమాధానం చెబుతారు. అంతేగా... అంతేగా..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: