సెక్స్ చేసేట‌ప్పుడు చాలా మందికి ఇప్ప‌టికి చాలా సందేహాలు అలానే ఉండిపోతాయి. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్పెర్మ్‌ బయటికి వస్తే... ఇలా జరగడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా త‌క్కువ అని అంటుంటారు. గర్భం ధరించాలంటే నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు, ఎన్ని రోజుల పాటు కలవాల్సి ఉంటుంది అనే వాటి మీద చాలా మందికి కలయిక సమయంలో ఇలా స్పెర్మ్‌ బయటికి రావడం అన్నది సర్వసాధారణం. చురుకుగా కదిలే స్పెర్మ్స్‌ వాటంతట అవే గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి, అక్కడి నుంచి ఫెలోపియన్‌ ట్యూబుల్లోకి ప్రవేశిస్తాయి. సెమెన్‌లో ఉన్న ద్ర‌వ‌పదార్థం మాత్రం బయటికి వచ్చేస్తుంది. అందుకని ఇలా జరగడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అన్న భయం అవసరం లేదు. 

 

మీరు ఫెర్‌టైల్‌ పిరియడ్‌ గురించి అడిగారు. మీకు నెలసరి క్రమం తప్పకుండా 28 రోజుకోసారి గనుక వస్తున్నట్లయితే నెలసరి వచ్చిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజు విడిచి రోజు కలిసుంటే సరిపోతుంది. ఈ సమయంలో అండం విడుదలవుతుంది కాబట్టి గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఎప్పుడైతే అండం ఉత్పత్తి అవుతుందో ఆ రోజుల్లో పిల్లల కోసం ప్లాన్ చేస్తే మంచిది. అది సరైన ఆలోచనే కానీ మీకు రుతుక్రమం ఎన్ని రోజులకోసారి వస్తుందో తెలియకుండా అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. 

 

ఓవ్యులేషన్‌ అనేది ఎప్పుడైనా రాబోయే నెలసరికి 14 రోజులు ముందుగా జరుగుతుంది. అంటే 28 రోజుల రుతుచక్రం ఉండే వారికి 14వ రోజున, 35 రోజులుండే వారికి 21వ రోజున, 40 రోజులుండే వారికి 26వ రోజున అండం విడుదలవుతుంది. ఈ లెక్క కూడా కచ్చితం కాదు. ఒక నాలుగైదు రోజులు అటూ ఇటుగా జరగవ‌చ్చు. అందుకని అండం విడుదలయ్యే సమయానికి నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల వెనక లెక్కపెట్టుకొని మొత్తం 9 రోజులు రోజు విడిచి రోజు కలిసి ఉంటే గర్భం నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: