ఈరోజుల్లో అవసరాలే రాజకీయ నేతలని నడిపిస్తాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందరు నేతలు అవసరాల కోసం చూడరు. ప్రజలే అవకాశం ఇస్తారని ఎదురుచూస్తారు. అలా ప్రజల ఇచ్చే అవకాశం కాకుండా, తమ వ్యక్తిగత అవసరాలు బట్టి పార్టీలు మారితే ఆ నేతల రాజకీయ భవిష్యత్ ముందు బాగున్న, తర్వాత మాత్రం ఇబ్బందుల్లో పడిపోతుంది. ఇక ఆ ఇబ్బందులు వచ్చాక మళ్ళీ భవిష్యత్ వెతుక్కునే పనిలో పడతారు.

 

అలా అవసరాల కోసం పార్టీ మారిపోయిన ఇద్దరు నేతలు..ఇప్పుడు భవిష్యత్ కోసం వెతుక్కునే పనిలోఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేల పరిస్తితి 2019 ఎన్నికల్లో ఏమైందో కూడా తెలిసిందే. ఒక ఎమ్మెల్యే తప్ప మిగతా వారంతా ఘోరంగా ఓడిపోయారు. అటు వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

 

దీంతో వైసీపీలో ఉన్న బాగుండేది అని ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులు ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ ఇద్దరు 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున మంచి మెజారిటీతో గెలిచారు. తర్వాత అధికారానికి ఆకర్షితులై జగన్‌ని వదిలేసి, చంద్రబాబు చెంత చేరారు.. అయితే 2019 ఎన్నికల్లో వీరు టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక ఇద్దరు నేతలు టీడీపీలో యాక్టివ్‌గా లేరు.

 

టీడీపీలోనే ఉంటే భవిష్యత్ శూన్యమని భావిస్తున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఉన్న తమ సన్నిహితుల ద్వారా ఫ్యాన్ గాలి కిందకు రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మోసం చేసి వెళ్ళిపోయిన వీరిని జగన్, పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: