ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని చిన్నపిల్లాడిని అడిగిన చెప్పేస్తారు. అయితే అందరికీ ఏపీలో 13 జిల్లాలు ఉంటే తెలుగుదేశం పార్టీకు మాత్రం 12 జిల్లాలే ఉన్నాయి. ఆ పార్టీకి కాస్తో కూస్తో 12 జిల్లాల్లో భవిష్యత్ కనిపిస్తుంది తప్ప, మిగిలిన ఒక జిల్లాలో భవిష్యత్ అసలు కనపడటం లేదు. ఇక టీడీపీకి అసలు భవిష్యత్ లేని జిల్లా ఏదో కాదు. సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇక్కడ టీడీపీ కనుమరుగైపోయే స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. అసలు జిల్లాలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండాపోయారు.

 

మామూలుగానే కడప వైసీపీ అడ్డా అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి రాని 2014 ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 10 సీట్లలో 9 సీట్లు గెలుచుకుంది. టీడీపీ ఒక సీటుకే పరిమితమైంది. అటు ఉన్న రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. టీడీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వైసీపీ అభ్యర్ధులు భారీ మెజారిటీలతో గెలిచేశారు.

 

అటు రాష్ట్రంలో కూడా వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కడప టీడీపీ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్ళిపోయారు. జిల్లాలో టీడీపీలో బలంగా వాయిస్ వినిపించే మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, సి‌ఎం రమేశ్‌లు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయిన కొందరు నేతలు వైసీపీ వైపు వెళ్ళిపోయారు. ఇక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఐటీ దాడులు జరగడంతో అడ్రెస్ లేకుండా పోయారు.

 

అటు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీలు సతీశ్ రెడ్డి, బీటెక్ రవిలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు యాక్టివ్‌గా ఉన్న పెద్దగా పొడిచేది ఏం లేదు. ఎందుకంటే భవిష్యత్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కడపలో మాత్రం టీడీపీ గెలవడం కష్టం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: